అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌

samsung released galaxy note 10 and 10 plus
Share Icons:

ముంబై:

 

స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ శాంసంగ్ కంపెనీ గెలాక్సీ నోట్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌లను తాజాగా విడుదల చేసింది. ఈ రెండు వేరియెంట్లతోపాటు నోట్ 10 ప్లస్‌కు గాను 5జీ సపోర్ట్ ఉన్న మరో వేరియెంట్‌ను కూడా శాంసంగ్ లాంచ్ చేసింది. 5జీ వేరియెంట్‌లో నోట్ 10 ప్లస్‌లో ఉన్న ఫీచర్లే ఉంటాయి.

 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 (8 జీబీ, 256 జీబీ) – 949.99 డాలర్లు (దాదాపుగా రూ.67,520)

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12 జీబీ, 256 జీబీ) – 1099.99 డాలర్లు (దాదాపుగా రూ.78,180)

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12 జీబీ, 512 జీబీ) – 1199.99 డాలర్లు (దాదాపుగా రూ.85,290)

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 5జీ (12 జీబీ, 256 జీబీ) – 1299.99 డాలర్లు (దాదాపుగా రూ.92,400)

 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 5జీ (12 జీబీ, 512 జీబీ) – 1399.99 డాలర్లు (దాదాపుగా రూ.99,505)

 

 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫీచర్లు…

 

* నోట్ 10 – 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్

* నోట్ 10 ప్లస్ – 6.8 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్

* ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9825 ప్రాసెసర్

* నోట్ 10 – 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్

* నోట్ 10 ప్లస్ – 12జీబీ ర్యామ్, 256/512 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

* ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

* నోట్ 10 – 12, 12, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

* నోట్ 10 ప్లస్ – 12, 12, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, వీజీఏ డెప్త్ విజన్ కెమెరా

* 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్

* డాల్బీ అట్మోస్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో

* అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బారో మీటర్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

* వైఫై 802.11 ఏఎక్స్, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి

* నోట్ 10 – 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్

* నోట్ 10 ప్లస్ – 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్

Leave a Reply