భారీ బ్యాటరీతో విడుదలైన శాంసంగ్‌ గెలాక్సీ ఎం31

Samsung Galaxy A51, Galaxy A71 With Infinity-O Display, Quad Rear Cameras Launched
Share Icons:

ముంబై: ప్రపంచ దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎం31ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.14,999 ఉండగా, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.15,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 5వ తేదీ నుంచి అమెజాన్‌లో విక్రయించనున్నారు. ఇందులో 6.4 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ-యు సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6జీబీ పవర్‌ఫుల్‌ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 64, 8, 5, 5 మెగాపిక్సల్‌ కెమెరాలు ఉండగా, ముందు భాగంలో 32 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ఇందులో డెడికేటెడ్‌ డ్యుయల్‌ సిమ్‌, మైక్రోఎస్‌డీ స్లాట్లను ఏర్పాటు చేశారు. 6000 ఎంఏహెచ్‌ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీలో ఇందులో అందిస్తున్నారు.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం31 ఫీచర్లు…

6.4 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ-యు సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 9611 ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌

64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌

64, 8, 5, 5 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

32 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

డాల్బీ అట్మోస్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0

యూఎస్‌బీ టైప్‌ సి, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌

ఎక్స్‌పీరియా 1 II

ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌పీరియా 1 II (మార్క్‌ 2)ను త్వరలో విడుదల చేయనుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌ ధర వివరాలను సోనీ ఇంకా వెల్లడించలేదు.

సోనీ ఎక్స్‌పీరియా 1 II ఫీచర్లు…

6.5 ఇంచుల 4కె ఓలెడ్‌ డిస్‌ప్లే, 1644 x 3840 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

గొరిల్లా గ్లాస్‌ 6 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌

8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 1టీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్‌ 10, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌

12, 12, 12 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, డాల్బీ అట్మోస్‌

సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, 5జీ, 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్‌ 5.1, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి

4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్‌ చార్జింగ్‌

 

Leave a Reply