బెస్ట్ ఫీచర్స్‌తో భారత్ మార్కెట్లో విడుదల కానున్న శాంసంగ్‌ కొత్త ఫోన్…

Samsung Galaxy A51, Galaxy A71 With Infinity-O Display, Quad Rear Cameras Launched
Share Icons:

ముంబై: దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎ51ను భారత్‌లో విడుదల చేయనుంది. రూ.24,485 ప్రారంభ ధరకు ఈ ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో.. 6.5 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ-ఓ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 9611 ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌, 48, 12, 5, 5 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 32 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌ సి, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

లెనోవో ఎం10 ఎఫ్‌హెచ్‌డీ రెల్‌

లెనోవో కంపెనీ ఎం10 ఎఫ్‌హెచ్‌డీ రెల్‌ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్‌ ట్యాబ్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.13,990 ధరకు ఈ ట్యాబ్‌ను వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో.. 10.1 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 8, 5 మెగాపిక్సల్‌ బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలు, డాల్బీ ఆడియో, బ్లూటూత్‌ 4.2, 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

తగ్గిన గెలాక్సీ ధరలు…

శాంసంగ్‌ సంస్థ గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో గెలాక్సీ ఎస్‌20, ఎస్‌20 ప్లస్‌ పేరిట నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను వచ్చే నెల విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించనున్న గెలాకీస అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో శాంసంగ్‌ ఆ ఫోన్లను లాంచ్‌ చేయనుంది. కాగా ఆ ఫోన్ల విడుదల నేపథ్యంలో శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌10 సిరీస్‌ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. గెలాక్సీ ఎస్‌10 ప్లస్‌ ధర రూ.17,100 తగ్గగా, ఎస్‌10, ఎస్‌10ఇ ఫోన్ల ధరలు రూ.16,100, రూ.8వేల మేర తగ్గాయి. దీంతో ప్రస్తుతం గెలాక్సీ ఎస్‌10 ప్లస్‌ 128 జీబీ వేరియెంట్‌ రూ.61,900 ధరకు లభిస్తున్నది. అలాగే గెలాక్సీ ఎస్‌10ను రూ.54,900 ధరకు, గెలాక్సీ ఎస్‌10ఇని రూ.47,900 ధరకు కొనుగోలు చేయవచ్చు.

 

Leave a Reply