ఆకర్షణీయమైన ఫీచర్లతో గెలాక్సీ ఎ71..

Samsung Galaxy A70s arrives with 64MP camera and new design
Share Icons:

ముంబై: దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్‌ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎ71ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎ71 స్మార్ట్‌ఫోన్‌ రూ.29,999 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

ఇందులో 6.7 ఇంచుల ఇన్ఫినిటీ-ఓ సూపర్‌ అమోలెడ్‌ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్‌ 730 ప్రాసెసర్‌, 8జీబీ పవర్‌ఫుల్‌ ర్యామ్‌లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్‌ మెయిన్‌ కెమెరాతోపాటు 12, 5, 5 మెగాపిక్సల్‌ కెపాసిటీ కలిగిన మరో 3 కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. డెడికేటెడ్‌ డ్యుయల్‌ సిమ్‌, మైక్రో ఎస్‌డీ స్లాట్లను ఇందులో అందిస్తున్నారు. 4500 ఎంఏహెచ్‌ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంది. దీనికి 25 వాట్ల సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ను అందిస్తున్నారు.

శాంసంగ్‌ గెలాక్సీ ఎ71 ఫీచర్లు…

6.7 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే

ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 730 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌

128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్‌10, డ్యుయల్‌ సిమ్‌

64, 12, 5, 5 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

32 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌

డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0

ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి

4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌

ఫింగర్స్‌ కంపెనీ నూతన బ్లూటూత్‌ స్పీకర్‌

డిజిటల్‌ యాక్ససరీస్‌ తయారీదారు ఫింగర్స్‌.. నాకౌట్‌ బేబీ పేరిట భారత్‌లో ఓ నూతన బ్లూటూత్‌ స్పీకర్‌ను లాంచ్‌ చేసింది. రూ.3299 ధరకు ఈ స్పీకర్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. దీనికి షాక్‌ ప్రూఫ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్‌ ద్వారా ఈ స్పీకర్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. అలాగే 24వాట్ల సామర్థ్యం ఉన్న 360 డిగ్రీ సౌండ్‌ను ఇచ్చే స్పీకర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ స్పీకర్‌ 12 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. అలాగే యూఎస్‌బీ, ఆక్స్‌ కనెక్టివిటీ, ఎఫ్‌ఎం రేడియో తదితర ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు.

 

Leave a Reply