లీకైన శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు, ధరల వివరాలు…

Share Icons:

ఢిల్లీ, 24 ఫిబ్రవరి:

బార్సిలోనాలో ఈ నెల 26 నుంచి జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 ప్రదర్శనలో శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్లు ‘గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్‌’లను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఫోన్లకు చెందిన ఫీచర్లు, ధరకి సంబంధించిన సమాచారం నెట్‌లో లీకయ్యాయి.

దాని ప్రకారం గెలాక్సీ ఎస్9 ధర రూ.67,125 వరకు ఉండవచ్చని, అలాగే గెలాక్సీ ఎస్9 ప్లస్ ధర రూ.79,560 వరకు ఉంటుందని సమాచారం.

ఈ ఫోన్లు ఇండియాలో ప్రత్యేకంగా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో మొదట లభ్యం కానున్నాయి. ఇప్పటికే వీటి విడుదల తేదీలను ఫ్లిప్‌కార్ట్ తమ సైట్‌లో తెలియజేస్తున్నది.

ఇక బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 సదస్సు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు అట్టహాసంగా జరగనుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మొబైల్ బ్రాండ్లు తయారు చేసిన స్మార్ట్‌ఫొన్లు విడుదలకానున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్9’ ఫీచర్లు…

 • 8 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
 • 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 • గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
 • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్/శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెసర్
 • 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
 • ఆండ్రాయిడ్ 0 ఓరియో
 • 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 • ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బారో మీటర్
 • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్
 • 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 0, ఎన్‌ఎఫ్‌సీ
 • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్

గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫీచర్లు…

 • 2 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
 • 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 • గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
 • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్/శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెసర్
 • 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
 • ఆండ్రాయిడ్ 0 ఓరియో
 • 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 • ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బారో మీటర్
 • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్
 • 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 0, ఎన్‌ఎఫ్‌సీ
 • 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్

మామాట: ఫీచర్లు బాగానే ఉన్న ధరలు మాత్రం అదురుతున్నాయిగా….

English summary:

Samsung will release its new smart phones’ Galaxy S9 and S Plus in the Mobile World Congress 2018 show to be held in Barcelona. In this background, the features of the phones and the price information were leaked on the net.

Leave a Reply