మొదలైన గెలాక్సీ నోట్‌ 10 లైట్‌ అమ్మకాలు…ఫీచర్లు ఇవే..

Samsung Galaxy Note 10 Lite With Triple Rear Cameras
Share Icons:

ముంబై: మొబైల్స్ తయారీదారు దిగ్గజం శాంసంగ్‌ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 10 లైట్‌ను ఇటీవలే భారత్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్‌కు గాను శాంసంగ్‌ తాజాగా విక్రయాలను ప్రారంభించింది. వినియోగదారులు ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌ వేరియెంట్‌ను రూ.38,999 ధరకు, 8జీబీ ర్యామ్‌ వేరియెంట్‌ను రూ.40,999 ధరకు ఇవాళ్టి నుంచి కొనుగోలు చేయవచ్చు.

గెలాక్సీ నోట్‌ 10 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌కు గాను రూ.5వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. నో కాస్ట్‌ ఈఎంఐ విధానంలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇందులో.. 6.7 ఇంచుల డిస్‌ప్లే, ఎగ్జినోస్‌ 9810 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 12, 12, 12 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 32 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

హైబ్రిడ్‌ హెచ్‌ఆర్‌

ప్రముఖ వాచ్‌ల తయారీదారు ఫాసిల్‌.. హైబ్రిడ్‌ హెచ్‌ఆర్‌ పేరిట ఓ నూతన హైబ్రిడ్‌ స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ వాచ్‌కు చెందిన లెదర్‌ స్ట్రాప్‌ వేరియెంట్‌ ధర రూ.14,995 ఉండగా, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ స్ట్రాప్‌ వేరియెంట్‌ ధర రూ.16,495గా ఉంది. ఈ వాచ్‌ను అమెజాన్‌తోపాటు ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.  ఇందులో కాల్‌ అండ్‌ టెక్ట్స్‌ ప్రివ్యూస్‌, హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, వర్కవుట్‌ ట్రాకింగ్‌, రియల్‌టైం వెదర్‌ అప్‌డేట్స్‌, 2 వారాల వరకు బ్యాటరీ బ్యాకప్‌, కస్టమైజబుల్‌ వాచ్‌ ఫేసెస్‌ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్‌, ఐఫోన్లకు బ్లూటూత్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకోవచ్చు. వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను ఇందులో అందిస్తున్నారు.

ఫోన్‌పే

ప్రముఖ ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌ ఫోన్‌పే తన వినియోగదారులకు ఓ నూతన ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. చాట్‌ పేరిట యూజర్లకు లభిస్తున్న ఈ ఫీచర్‌ సహాయంతో ఫోన్‌పే యాప్‌లో వారు తమ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారికి మనీ రిక్వెస్ట్‌ పంపుకోవచ్చు. అలాగే వారికి డబ్బులు సులభంగా పంపించవచ్చు. అందుకు గాను ఇతర చాట్‌ యాప్‌లను వాడాల్సిన పనిలేదు. ఫోన్‌పే యాప్‌లో ఉండే చాట్‌ ఫీచర్‌లోనే ఇతరులను డబ్బులు కావాలని అడగవచ్చు. అందులోనే ఇతరులతో చాట్‌ చేయవచ్చు. ఇక త్వరలోనే గ్రూప్‌ చాట్‌ ఫీచర్‌ను కూడా ఫోన్‌పే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. అయితే ఈ ఫీచర్ ఇప్పటికే గూగుల్ పేలో ఉంది.

 

Leave a Reply