భారత్‌లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎం40

Samsung released galaxy s9 2018 smartphone
Share Icons:

ముంబై, 12 జూన్:

దక్షిణకొరియా దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం40ని ఈరోజు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 19వ తేదీ నుంచి లభ్యం కానుంది. అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా విక్రయించనున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం40 ఫీచర్లు…

* 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 32, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

 

 

Leave a Reply