తక్కువ ధరలో కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విడుదల చేసిన శాంసంగ్

samsung galaxy a8.0 tab released in india
Share Icons:

 

ముంబై:

 

ప్రముఖ మొబైల్స్ తయారీదారు శాంసంగ్ సంస్థ గెలాక్సీ ట్యాబ్ ఎ 8.0 (2019) పేరిట కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ట్యాబ్‌కు చెందిన వైఫై వేరియెంట్ ధర రూ.9,999 ఉండ‌గా, ఎల్‌టీఈ వేరియెంట్ ధర రూ.11,999 గా ఉంది.

 

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 8.0 (2019) ట్యాబ్లెట్‌లో 8 ఇంచ్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 429 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, వైఫై, 4జీ ఎల్‌టీఈ, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

 

శాంసంగ్ సంస్థ గెలాక్సీ నోట్ సిరీస్‌లో తన నూతన స్మార్ట్‌ఫోన్లు నోట్ 10, నోట్ 10 ప్లస్‌లను తాజాగా విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ ఫోన్లకు గాను శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, టాటా క్లిక్‌లలో ప్రీ ఆర్డర్లను ప్రారంభించామని శాంసంగ్ తెలిపింది.

 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 (8జీబీ + 256జీబీ) – రూ.69,999

 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12జీబీ + 256జీబీ) – రూ.79,999

 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12జీబీ + 512జీబీ) – రూ.89,999

 

ఇక ఈ ఫోన్లపై పలు లాంచింగ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్లను ప్రీ బుకింగ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఐసీఐసీఐ కార్డులతో ప్రీబుకింగ్ చేసి ఈ-కామర్స్ సైట్లలో ఈ ఫోన్లను కొంటే రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే ఈ ఫోన్లను కొన్న యూజర్లకు రూ.19,990 ధర కలిగిన గెలాక్సీ వాచ్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ.9,999 ధరకే అందివ్వనున్నారు.

Leave a Reply