బంపర్ ఆఫర్: గెలాక్సీ ఎ50ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింది…

Samsung Galaxy A70s arrives with 64MP camera and new design
Share Icons:

ముంబై:  శాంసంగ్‌ తన గెలాక్సీ ఎ50ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను గత సెప్టెంబర్‌ నెలలో భారత్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్‌కు చెందిన 4/6 జీబీ ర్యామ్‌ వేరియెంట్ల ధరలను శాంసంగ్‌ తగ్గించింది. రూ.2500 మేర ఈ ఫోన్‌ ధర తగ్గింది. దీంతో ప్రస్తుతం తగ్గించిన ధరకే ఈ రెండు వేరియెంట్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, 32 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, 48, 5, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌

నాయిస్‌ కంపెనీ ట్యూన్‌ చార్జ్‌ పేరిట నూతన వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.1699 ధరకు ఈ ఇయర్‌ఫోన్స్‌ను నాయిస్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌తోపాటు అమెజాన్‌ సైట్‌లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. వీటికి ఐపీఎక్స్‌5 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇవి 16 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. వీటికి డెడికేటెడ్‌ బేస్‌ బూస్టర్‌ బటన్‌ను అందిస్తున్నారు. అందువల్ల అత్యుత్తమ క్వాలిటీ కలిగిన సౌండ్‌ అవుట్‌పుట్‌ను ఆస్వాదించవచ్చు. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఈ ఇయర్‌ఫోన్స్‌ ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ అవుతాయి. వీటికి ఆపిల్‌ సిరితోపాటు గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌ను అందిస్తున్నారు.

వాట్సాప్‌లో పేమెంట్స్‌ ఫీచర్‌

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో ఇకపై పేమెంట్స్‌ ఫీచర్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ పలువురు ఎంపిక చేసిన యూజర్లకు అందిస్తూ ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నది. ఈ క్రమంలోనే త్వరలో వాట్సాప్‌ పే ఫీచర్‌ దేశంలోని వాట్సాప్‌ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌ పే సేవలు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా వినియోగదారుల డేటాను భారత్‌లోని సర్వర్లలోనే స్టోర్‌ చేయాలన్న కేంద్రం నిబంధనల మేరకు వాట్సాప్‌కు నిర్ణయం తీసుకునేందుకు కొంత ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు ఆ నిబంధనకు వాట్సాప్‌ ఒప్పుకోవడంతో మొదటగా ఆర్‌బీఐ వాట్సాప్‌కు డిజిటల్‌ చెల్లింపులు నిర్వహించుకునేందుకు అనుమతిని ఇచ్చింది.

 

Leave a Reply