భారత్‌లో విడుదలైన శాంసంగ్  గెలాక్సీ ఎ20ఎస్‌…

Samsung Galaxy A20s With Triple Rear Cameras, Snapdragon 450 SoC Launched in India
Share Icons:

ముంబై: ప్రపంచ దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ20ఎస్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.11,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,999గా ఉంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

గెలాక్సీ ఎ20ఎస్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు..

6.4 ఇంచుల డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4జీబీ ర్యామ్, 32/64జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, 13, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

తక్కువ ధరకే ఆండ్రాయిడ్ టీవీలు

ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానాసోనిక్ జీఎక్స్, జీఎస్ సిరీస్‌లో నూతన ఆండ్రాయిడ్, 4కె టీవీలను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. జీఎస్655 సిరీస్‌లో 32, 43 ఇంచ్ మోడల్స్ లభిస్తుండగా, జీఎక్స్655 సిరీస్‌లో 43, 49, 55, 65 ఇంచ్ మోడల్ టీవీలు లభ్యమవుతున్నాయి. వీటిల్లో ఆండ్రాయిడ్ ఓఎస్, గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్, పాపులర్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్ తదితర ఫీచర్లను కామన్‌గా అందిస్తున్నారు. ఇక జీఎస్ సిరీస్ టీవీల ప్రారంభ ధర రూ.27,900 ఉండగా, జీఎక్స్ సిరీస్ టీవీల ప్రారంభ ధర రూ.50,400గా ఉంది. వీటిపై పానాసోనిక్ 1+2 ఇయర్ వారంటీని అందిస్తుంది.

ఫోన్ల ఉత్పత్తిని పెంచిన ఆపిల్

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన నూతన ఐఫోన్లు.. ఐఫోన్ 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్‌లను గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తయారీదార్లకు ఆపిల్ ఐఫోన్ 11 ఫోన్లను మరో 10 శాతం (దాదాపుగా 8 మిలియన్ యూనిట్లు) వరకు అదనంగా ఉత్పత్తి చేయాలని ఆర్డర్లు ఇచ్చింది. కాగా భారత్‌లో ఐఫోన్ 11పై ఆకట్టుకునే డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తుండడంతోపాటు ఈ ఫోన్ మిగిలిన రెండు ఐఫోన్ల కన్నా తక్కువ ధర ఉండడంతో దీన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని, అందుకనే భారత్‌లో ఐఫోన్ 11కు డిమాండ్ పెరిగింది.

 

Leave a Reply