బంపర్ ఆఫర్: ఆ రెండు ఫోన్ల ధరలు తగ్గించిన శాంసంగ్

Samsung Galaxy A50s, Galaxy A30s Launched in india
Share Icons:

ముంబై: ప్రపంచ దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్ కంపెనీ తన గెలాక్సీ ఎ50ఎస్, ఎ30ఎస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. గెలాక్సీ ఎ30ఎస్‌పై రూ.1వేయి, గెలాక్సీ ఎ50ఎస్‌పై రూ.3వేల వరకు ధరలను తగ్గించినట్లు శాంసంగ్ తెలిపింది. ఈ క్రమంలో గెలాక్సీ ఎ50ఎస్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.19,999 ధరకు లభిస్తుండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.21,999గా ఉంది.

అలాగే గెలాక్సీ ఎ30ఎస్ రూ.15,999 ధరకు లభిస్తున్నది. ప్రస్తుతం తగ్గిన ధరలకే ఈ ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ ఎ50ఎస్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, 4/6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు తదితర ఫీచర్లను అందిస్తుండగా, గెలాక్సీ ఎ30ఎస్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 25, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

ఫ్రెషియా ఎయిర్ ప్యూరిఫైర్లు….

హావెల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ భారత మార్కెట్‌లోకి ఫ్రెషియా సిరీస్‌లో పలు నూతన ఎయిర్ ప్యూరిఫైర్లను ప్రవేశపెట్టింది. ఇవి రూ.14,490 నుంచి రూ.43,290 ధరల నడుమ వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటిని ఆఫ్‌లైన్ స్టోర్స్‌తోపాటు హావెల్స్ వెబ్‌సైట్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. వీటిల్లో 9 స్టేజ్ ఎయిర్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఫీచర్‌ను ఏర్పాటు చేసినందున గాలిలో ఉండే 99 శాతం కాలుష్య, ధూళి కణాలు తొలగిపోతాయి. 485 నుంచి 958 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కవర్ చేసే ప్యూరిఫైర్లు ఈ సిరీస్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక హ్యుమిడిఫైర్, యాక్టివేటెడ్ కార్బన్, స్టెరిలైజింగ్ యూవీ లైట్, యాంటీ బాక్టీరియల్ బాల్స్, అబ్జార్బింగ్ టాక్సిక్ ఎలిమెంట్స్, ఇన్‌ఫ్యూజింగ్ ది ఎయిర్ తదితర ఫీచర్లను కూడా ఈ ఎయిర్ ప్యూరిఫైర్లలో అందిస్తున్నారు.

149 ప్లాన్ వాలిడిటీ తగ్గించిన జియో…

టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న రూ.149 ప్లాన్ బెనిఫిట్స్‌కు పలు మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇకపై ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే 300 నిమిషాల జియో టు నాన్ జియో కాల్స్ వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ గతంలో 28 రోజులు ఉండగా ఇప్పుడు దీన్ని 24 రోజులకు తగ్గించారు.

 

Leave a Reply