శాంసంగ్‌ నుంచి కొత్త ఫోన్…సూపర్ ఫీచర్స్…

Share Icons:

ముంబై: మొబైల్స్ తయారీదారు దిగ్గజం శాంసంగ్‌ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎక్స్‌కవర్‌ ప్రొ ను తాజాగా విడుదల చేసింది. రూ.35,430 ధరకు ఈ ఫోన్‌ను త్వరలో విక్రయించనున్నారు. ఇందులో… 6.3 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 9611 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, 25, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 13 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌ సి, ఎన్‌ఎఫ్‌సీ, 4050 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

బజాజ్ ఎలక్ట్రిక్‌ చేతక్‌

బజాజ్‌ కంపెనీ.. ఎలక్ట్రిక్‌ చేతక్‌ (ఇ-చేతక్‌) పేరిట రిలీజ్ చేయనుంది. బజాజ్‌ ఎలక్ట్రిక్‌ చేతక్‌ను సరికొత్త ఫీచర్లు, లుక్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే డిజైన్‌, కలర్స్‌, అధునాతన ఫీచర్లు కొత్త చేతక్‌లో అందివ్వనున్నారు. డేటా కమ్యూనికేషన్‌, సెక్యూరిటీ, యూజర్‌ అథెంటికేషన్‌ తదితర స్మార్ట్‌ ఫీచర్లను ఎలక్ట్రిక్‌ చేతక్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే మార్కెట్‌లో ఏథర్‌, ఒకినావా, హీరో తదితర కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండగా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ చేతక్‌ వాటికి గట్టి పోటీనివ్వనుంది.

ఈ స్కూటర్‌ని ఒక్కసారి ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్‌ మోడ్‌లో 85 కిలోమీటర్లు వెళ్లవచ్చు. ఈ స్కూటర్‌ ఫుల్‌ చార్జింగ్‌ అయ్యేందుకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్‌ చార్జింగ్‌ ఆప్షన్‌ లేదు. బ్యాటరీలను మార్చుకునే అవకాశం కూడా లేదు. ఈ స్కూటర్లను పూణె సమీపంలోని బజాజ్‌ ప్లాంట్‌లో తయారు చేస్తుండగా వీటిని మరో వారం, 10 రోజుల్లో మార్కెట్‌లో విక్రయించనున్నారు. మొదటగా పూణె, బెంగళూరులలో ఈ స్కూటర్లు లభ్యం కానున్నాయి. ఇక ఈ స్కూటర్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.1 లక్ష వరకు ఉంటుందని సమాచారం.

 

Leave a Reply