అప్పుడు కౌశల్ బలం ఏమిటో తెలియదు….

samrat comments about kaushal
Share Icons:

హైదరాబాద్, 7 అక్టోబర్:

బిగ్‌బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా వెళ్లిన సామ్రాట్… ముందు నుంచి ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ తేజస్వితో క్లోజ్‌గా ఉండటం వలన సామ్రాట్….ఆమెతో ప్రేమాయణం నడిపించాడనే మాటలు బాగా వినిపించాయి.

ఇక వీటిపై తాజాగా స్పందించిన సామ్రాట్.. తేజస్విది టామ్ బాయ్ క్యారెక్టర్ అని, హౌస్‌లో ఉన్న రోజులు బాగా ఇరిటేట్ చేసిందని అన్నారు.

అయితే తామిద్దరం మంచి స్నేహితులు మాత్రమేనని.. తనీష్‌కి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో.. తేజస్వితో ఉన్నది కూడా అలాంటి బంధమేనని, అంతకుమించి తమ ఇద్దరి మధ్య ఏం లేదని క్లారీటి ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఇక కౌశల్ గురించి మాట్లాడుతూ.. హౌస్‌లో ఉన్నప్పుడు కౌశల్ బలం ఏమిటో తెలియలేదని, బయటకొచ్చిన తరువాత ఆయనకున్న ఫాలోయింగ్ చూసి షాక్ అయినట్లు చెప్పాడు. మొదటి నుండి హౌస్‌లో ఎంతో క్రమశిక్షణతో కౌశల్ ఉన్నాడని, ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.

అయితే హౌస్ మేట్స్ ని కుక్కలని కౌశల్ అనడం కరెక్ట్ కాదని, ఆయన అలా అనకుండా ఉండి ఉంటే బాగుండేదని తెలిపారు.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో సహా ఇతర ఏ రియాల్టీ షోలో పాల్గొన్న వారికి దక్కనన్ని ఓట్లు కౌశల్‌కు పడ్డాయి. దీంతో గిన్నిస్ రికార్డుల్లోకి ఆయన పేరు చేరనుందని తెలుస్తోంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల నుంచి కౌశల్‌కు కాల్ వచ్చిందని టాక్. ‘బిగ్ బాస్‌తో పాటు ఇతర రియాల్టీ షోల్లో ఇప్పటి దాకా ఎవరికీ రానన్ని ఓట్లు మీకు వచ్చాయి. దీంతో మీ పేరును గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరుస్తున్నామ’ని చెప్పారని కౌశల్ ప్రకటించాడు. అతి త్వరలోనే గిన్నీస్ బుక్ ప్రతినిధులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట. 

మామాట: మొత్తానికి కౌశల్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు…

Leave a Reply