3రోజుల్లో 12 కోట్లు కలెక్ట్ చేసిన కొబ్బరిమట్ట..ఫ్యాన్స్ కోసం 9 కోట్లు కలిపారు

sampoornesh babu kobbarimatta movie collection
Share Icons:

హైదరాబాద్:

 

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రం గత శనివారం విడుదలైన విషయం తెలిసిందే. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా కొబ్బరిమట్ట మూడు రోజుల్లోనే రూ. 12 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిందట. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా విడుదల చేసిన సినిమా నిర్మాతలు, అదే పోస్టర్ లో చిన్న అక్షరాలతో అసలు విషయాన్ని చెప్పి అందరినీ షాక్ కు గురిచేశారు.

 

ఈ పోస్టర్ లో కలెక్షన్ వివరాల పక్కనే ఓ స్టార్‌ మార్క్‌ కనిపిస్తూ ఉంటుంది. దానికి కాస్తంత కిందభాగంలో, ఫ్యాన్స్‌ కోసం రూ. 9 కోట్ల ఫేక్‌ కలెక్షన్లు కలిపామన్న క్లారిటీ కూడా ఉంది. అంటే ఈ సినిమా మూడు రోజుల్లో మూడు కోట్ల రూపాయలను వసూలు చేసిందన్నమాట.

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ ఆడియన్స్ మనసులను దోచేసుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా తన జోరును చూపించింది. నభా నటేశ్ .. నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, 25 రోజుల్లో 80 కోట్ల గ్రాస్ ను రాబట్టేసిందని చెబుతున్నారు. రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలిచింది

Leave a Reply