మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు

Share Icons:

హైదరాబాద్, 12 జనవరి:

మేడారం జాతర జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలంలో మేడారం గ్రామంలో జరిగే గిరిజన జాతర. అక్కడ సమ్మక్క, సారక్కలు కొలువై ఉంటారు. అందుకే దీన్ని సమ్మక్క సారక్క జాతర అంటారు. రెండు సంవత్సరాలకి ఒకసారి ఈ జాతర జరుగుతుంది. దీనికి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తుంది. కుంభమేళా తరహాలో ఈ జాతర నిర్వహించాలని అనుకుంటుంది.  జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ జాతర జరగనుంది.

అలాగే జాతరకి వచ్చే భక్తుల సౌకర్యార్థం హెలికాఫ్టర్‌ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. విదేశీ యాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యేక వసతి సదుపాయం,  సాంస్కృతిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి జాతర కార్యక్రమాల్ని పర్యవేక్షించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

అదేవిధంగా జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, గిరిజన పార్లమెంటు సభ్యుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.

జాతర విశేషాలు

తాడ్వాయి మండలంలో ఉన్నమారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది . అక్కడ  సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలుగా సమ్మక్క-సారక్క పూజలందుకుంటున్నారు .

సమ్మక్క సారలమ్మలకు ఒక ప్రత్యేకమైన ఆకారం అంటూ లేదు. మేడారం గ్రామంలో గద్దెలు నిర్మించి, వాటికి ఒక కర్ర నాటి ఉంటుంది. వీటిని సమ్మక్క, సారలమ్మల గద్దెలు అంటారు. ఇక జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు.

దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుతీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి ముందు ఉన్న స్థానానికి తరలిస్తారు. అయితే ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం. ఇక భక్తులు తమ కోర్కెలు తీర్చమని అమ్మవార్లకు బెల్లము నైవేద్యముగా సమర్పించుకుంటారు.

మామాట: మేడారం జాతర నమ్మకం సరే… జర రోగాలను కూడ పట్టించకోర్రీ… 

English summary: Sammakka Saralamma Jatara or Medaram Jatara is a tribal festival of honouring the goddesses celebrated in the state of Telangana, India. The Jatara begins at Medaram in Tadvai mandal in Jayashankar Bhupalpally district.

Leave a Reply