ఆకట్టుకుంటున్న ’సమయమా’ మెలోడీ సాంగ్…(వీడియో)

Share Icons:

హైదరాబాద్, 1 డిసెంబర్:

మెగా వారసుడు వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో, ఘాజీ ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్ర అంత‌రిక్షం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన రాగా,  తాజాగా ‘సమయమా.. అదేమిటంత తొందరేంటి ఆగుమా!! అనే మెలోడియ‌స్ సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. ఈ పాటకి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించ‌గా, హరిణి, యాజిర్ నిహార్‌లు ఆల‌పించారు. ప్రశాంత్ ఆర్. విహారి చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేయ‌నున్నారు. 

ఇక ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్‌‌గా ఈ చిత్రంలోని సన్నివేశాలను జీరో గ్రావిటీ సెట్స్‌‌పై చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి టేకింగ్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌గా ‘అంతరిక్షం’ ఉండబోతుందని దర్శకుడు సంకల్ప్ రెడ్డి టీజర్‌లో హింట్ ఇచ్చారు. ట్రాయ్, జీరో డార్క్, గేమ్ ఆప్ థ్రోన్స్ వంటి హాలీవుడ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడం మరో విశేషం. కాగా, ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.

మామాట: లిరిక్స్ వినసోంపుగానే ఉన్నాయి…

One Comment on “ఆకట్టుకుంటున్న ’సమయమా’ మెలోడీ సాంగ్…(వీడియో)”

Leave a Reply