యు టర్న్ సెన్సార్ పూర్తి.. ‘యూ/యే’ సర్టిఫికేట్..

Share Icons:
 హైదరాబాద్, సెప్టెంబర్ 07,
సమంత ప్రదానపాత్రలో నటించిన చిత్రం యు టర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘యూ/యే’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 13న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు ప్రమోషనల్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండింటికి దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యు టర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ లో తెరకెక్కించారు. రెండు భాషల్లోనూ ఒకేరోజు విడుదల కానుంది ఈ చిత్రం.
రాహుల్ రవీంద్రన్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. పూర్ణచంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్ బ్యానర్స్ పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు యు టర్న్ చిత్రాన్ని నిర్మించారు.
నటీనటులు: సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్, నరైన్.
మామాట: భర్తకు పోటీ ఇస్తుందా సమంతా

Leave a Reply