అబార్షన్‌ వార్తలపై సమంత స్పందన…

Share Icons:

తెలుగు తెరపై మోస్ట్‌ రోమాంటిక్‌ కపుల్‌గా పేరు గాంచిన నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి విడాకుల వ్యవహారంపై అనేక రకాలుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా సామ్‌ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్‌ చేయించుకుందని.. పిల్లల్ని కంటే కెరీర్‌కు అడ్డుగా మారుతుందని భావించిందని… ఈ విషయం చైతన్యకు నచ్చకనే ఇద్దరు విడిపోయారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. పిల్లల విషయంలో నాగ్‌ కుటుంబం సమంతకు ఎంతో నచ్చచెప్పిందని.. కానీ ఆమె వినలేదనే వార్తలు కూడా వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఈ పుకార్లపై సమంత తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. తాను అబార్షన్‌ చేయించుకున్నానే వార్తల్ని ఖండించారు. ఈ క్రమంలో సామ్‌ ఇన్‌స్టాలో ఓ స్టోరీ షేర్‌ చేశారు. ‘‘ఇలాంటి కఠిన సమయంలో మీరు చూపిన ఆదరణకు ధన్యవాదాలు. నాకు మద్దతుగా నిలిచి.. నాపై వచ్చిన అబద్దపు వార్తలని ఖండించారు. ‘వాళ్లు’ నాకు వేరే వాళ్లతో అఫైర్స్‌ ఉన్నాయని.. నేను పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. అబార్షన్‌ చేయించుకున్నానని.. నేను అవకాశవాదినని ఇలా రకరకాల వార్తలు ప్రచారం చేశారు’’.

‘‘కానీ విడాకులు తీసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన అంశం. దీన్నుంచి బయటపడటానికి సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో నాపై వ్యక్తిగతంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు. అయితే ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను.. ఈ తప్పుడు ప్రచారం నన్ను ఏమాత్రం కుంగదీయలేదు అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు సమంత.

‘పాత ప్రేమ పాటలు – పర్వతాలు. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని. కొన్ని పొగొట్టుకున్న పాత చిత్రాల పాటలు దొరికినప్పుడు. లోలోపలి బాధను ప్రతి ధ్వనించే ఆ ప్రేమ పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు. సందులలో గాలి శబ్దం’ అంటూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు. అయితే రేపు జరిగే ఫ్యాషన్‌ షో కోసం తను ఎదురు చూస్తున్నట్లు ఈ పోస్ట్‌ ద్వారా ఆమె పేర్కొన్నప్పటికీ ఇందులో మరెదో లోతైన అర్థం వచ్చేలా ఉన్న తన నోట్‌ చూసి నెటిజన్లు, అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

సమంత తాజా ఇన్‌స్టాగ్రాం మెసేజ్…

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply