సమంతకు సవాల్ విసిరిన సాయి పల్లవి….

sai pallavi green challenge to samantha
Share Icons:

 

హైదరాబాద్: పర్యావరణాన్ని కాపాడి,చెట్లు నాటడమే లక్ష్యంగా దేశంలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం తెలంగాణలో చురుగ్గా కొనసాగుతుంది. అయితే తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ మొదట ప్రారంభించారు. అంతేకాదు మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 5న వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

అయితే ఈ ఛాలెంజ్ సినీ నటుల మధ్య కొనసాగుతుంది. సినీ స్టార్లు మొక్కలు నాటుతూ తమ సహచర నటులను హరిత సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే అక్కినేని అఖిల్, మాజీ ఎంపీ కవిత, వరుణ్ తేజ్ మొక్కలు నాటారు. ఇటీవలే మొక్కలు నాటిన వరుణ్ తేజ్… సాయిపల్లవి, తమన్నాను నామినేట్ చేశాడు. వరుణ్ తేజ్ ఛాలెంజ్ స్వీకరించిన ఫిదా బ్యూటీ సాయిపల్లవి గురువారం తన ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటింది. ఆ ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేసింది.

గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి క్షీణించిందని.. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని కోరింది సాయిపల్లవి. ప్రకృతి నుంచి ఎక్కువగా తీసుకుంటూ.. ప్రకృతికి మాత్రం తక్కువగా ఇస్తున్నామని తెలిపింది. ఇక ఇండియా ఛాలెంజ్‌కు టాలీవుడ్ బ్యూటీలు సమంత అక్కినేని, రానా దగ్గుబాటని నామినేట్ చేశారు. ఇద్దరూ గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని సూచించింది. ఇక తనకు ఛాలెంజ్ విసిరిన వరుణ్ తేజ్ కు ధన్యవాదాలు తెలిపింది.

సైరా కలెక్షన్లు….

అక్టోబర్ 2న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా వసూళ్లలో దుమ్ముదులుపుతుంది. తెలుగు రాష్ట్రాలలోను ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8 రోజుల్లో 90 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. ‘సైరా’కి  పోటీగా భావించదగిన సినిమాలేవీ దగ్గరలో లేవు. అందువలన ఈ వీకెండ్ తో పాటు మరికొన్ని రోజులు ఈ సినిమా వసూళ్ల దూకుడు తగ్గకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

Leave a Reply