దూసుకెళుతున్న సాహో టీజర్…

prabhas-saaho-movie-release-date-fix
Share Icons:

 

హైదరాబాద్, 14 జూన్:

‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. తాజాగా సాహో సినిమా టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాలో సీన్స్, ఛేజింగ్ దృష్యాలను చూస్తే.. ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్‌లో ఉంది. దర్శకుడిగా సుజిత్ టేకింగ్, ఫోటోగ్రఫీ, ప్రభాస్ స్టంట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.

ఇక సాహో టీజర్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం కేవలం ఒక గంటలోనే లక్ష వ్యూస్ ని సాధించింది . అలాగే కేవలం 6 గంటల్లోనే 25 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది . యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో ఉంది సాహూ టీజర్ .

ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు . టీజర్ తో కేక పెట్టించిన ప్రభాస్ ట్రైలర్ తో బాక్స్ లు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది .

Leave a Reply