400 కోట్ల క్లబ్ లో ‘సాహో’..’సరిలేరు నీకెవ్వరు’లో తమన్నా…

sahoo 400 crore club...tammanna special song in sarileru neekavvaru
Share Icons:

హైదరాబాద్:

భారీ బడ్జెట్ తో రూపొందించిన సాహో చిత్రం గత నెల 30వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. అతి భారీ బడ్జెట్ తో రూపొందిన సాహోకు తొలిరోజు నుంచి మిక్సడ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే  నాలుగు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్ముదులుపుతోంది. భారీ ఓపెనింగ్స్ తో అనేక ప్రాంతాల్లో కొత్త రికార్డులను సృష్టించిన ‘సాహో’ .. 10 రోజుల్లో 400 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది.

నాలుగు భాషల్లో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. లాంగ్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను చేరుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ తదుపరి సినిమాగా ‘జాన్’ రూపొందుతోన్న సంగతి తెలిసందే.

తమన్నా సాంగ్…

మహేశ్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేశ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాలోని ఒక పాటలో మహేశ్ సరసన తమన్నా మెరవనుందనేది తాజా సమాచారం.

అయితే ఇది ఐటమ్ సాంగ్ కానీ .. స్పెషల్ సాంగ్ గాని కాదట. మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ అని అంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర రీత్యా ఇంట్రడక్షన్ సాంగ్ లో ఆయన స్టెప్స్ వేయకుండా హుందాగా వ్యవహరించవలసి ఉంటుంది. అందువలన ఆయన హుందా తనాన్ని కాపాడుతూ, ఆ పాటలో తమన్నా వయ్యారాలు ఒలకబోస్తూ స్టెప్స్ వేసేలా ప్లాన్ చేశారట. ఇందుకుగాను తమన్నాకి పారితోషికంగా పెద్దమొత్తమే ముడుతుందని అంటున్నారు.

గద్దలకొండ గణేశ్ గా వాల్మీకి…

వరుణ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. పోస్టర్స్ లో ఆయన గెటప్ చూసిన వాళ్లంతా ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ఏదై ఉంటుందా అనే ఆత్రుతను కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పాత్ర పేరు ‘గద్దలకొండ గణేశ్’ అనే విషయాన్ని వరుణ్ తేజ్ బయటపెట్టాడు. ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజా హెగ్డే, మరో కథానాయికగా మృణాళిని రవి నటించారు.

 

Leave a Reply