సచిన్‌ని నిరాశపర్చిన వరుణుడు….

సచిన్‌ని నిరాశపర్చిన వరుణుడు….
Views:
5

లండన్, 10 ఆగష్టు:

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్‌లో మొదలైన రెండో టెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయింది.

అయితే రెండో టెస్ట్ తొలి రోజు ఆటకు వరుణుడు అడ్డుపడటంపై లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తంచేశాడు. చారిత్రక లార్డ్స్ మైదానంలో ఉన్న గంటను మోగించి మ్యాచ్‌ను ప్రారంభించే అవకాశం ఈసారి సచిన్‌కు దక్కింది. అతనికి ఈ అవకాశం రావడం ఇదే తొలిసారి.

 వర్షం కారణంగా కవర్స్‌తో కప్పిన లార్డ్స్ పిచ్‌ (ICC/Twitter)

కానీ తొలిరోజు కనీసం టాస్ కూడా పడకపోకుండా…వరుణుడు అడ్డుకోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ సచిన్ ట్వీట్ చేశాడు. కనీసం తర్వాతి నాలుగు రోజులైనా మ్యాచ్ జరగాలని ఆశిస్తున్నా అని మాస్టర్ అన్నాడు. ఇక సచిన్ కాకుండా అంతకముందు గవాస్కర్, పటౌడీ జూనియర్, దిలీప్ వెంగ్‌సర్కార్, రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు లార్డ్స్‌లో గంట మోగించి మ్యాచ్‌లను ప్రారంభించారు.

కాగా, 2007 నుంచి లార్డ్స్‌లో ఇలా ఓ అంతర్జాతీయ క్రికెటర్ లేదా ప్రముఖుల చేత మ్యాచ్‌కు ముందు ఐదు నిమిషాల పాటు గంట మోగించడం ఆనవాయితీగా మార్చారు.

మామాట: మరి ఈరోజు అయిన వరుణుడు ఆగుతాడో లేదో?

(Visited 6 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: