కేరళలో కొనసాగుతున్న ఆందోళనలు…లెఫ్ట్ వర్సెస్ బీజేపీ

Share Icons:

తిరువనంతపురం, 5 జనవరి:

శబరిమల ఆలయంలోకి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై కేరళలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అలాగే శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఇందులో భాగంగా ఆందోళనకారులు నాటుబాంబులు, రాళ్లతో దాడులకు దిగుతున్నారు. ఈ ఘటనల వల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇక శుక్రవారం హిందూ సంస్థలు, లెఫ్ట్‌ కార్యకర్తల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. కోజిక్కోడ్‌లోని మలబార్‌ దేవస్వం బోర్డు సభ్యుడు కె.శశికుమార్‌ నివాసంపై కొందరు నాటుబాంబులు విసిరారు. పథనంతిట్టలోని అదూర్‌లో ఒక మొబైల్‌ ఫోన్ల దుకాణంపైనా బాంబులు వేశారు. అలాగే కన్నూరులోని  బీజేపీ కార్యాలయానికి కొందరు నిప్పంటించారు. పథనంతిట్ట, కన్నూరు, కోజిక్కోడ్‌, తిరువనంతపురం జిల్లాల్లో బీజేపీ, లెఫ్ట్‌ కార్యకర్తలు ఒకరి నివాసాలపై మరొకరు రాళ్ల దాడులు చేసుకున్నారు.

మరోవైపు శబరిమల అంశంపై ఆందోళనల్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతుంది శబరిమల పరిరక్షణ సమితి. ఈనెల 11, 12, 13 తేదీల్లో రథయాత్రలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

మామాట: ఈ ఆందోళనలు ఇప్పటితో ఆగేలా లేవుగా…

Leave a Reply