కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘ఆర్‌ఎక్స్ 100’

Rx100 collections
Share Icons:

హైదరాబాద్, 19 జూలై:

యూత్‌కి కావల్సిన అన్నీ మసాలాలని కలిపి తీసిన ఆర్‌ఎక్స్ 100 చిత్రం కలెక్షన్లలో దూసుకుపోతుంది. కిందటి గురువారం విడుదలైన ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే ఏకంగా 7.5 కోట్ల షేర్‌ని రాబట్టింది.

ప్రేమకి యాక్షన్ .. ఎమోషన్ కలిస్తే అది ఏ స్థాయిలో పండుతుందనేదానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలిచింది. హీరో కార్తికేయ నటన, హీరోయిన్ పాయల్ రాజ్‌పుట్ అందాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయి.

కేవలం రెండున్నర కోట్లతో బోల్డ్ కంటెంట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని చూసేందుకు యువత థియేట‌ర్ల వ‌ద్ద క్యూ క‌డుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఆరు రోజుల్లో 15 కోట్ల గ్రాస్, 7.5 కోట్ల షేర్‌ని సాధించింది. కేవలం ఒక్క తెలంగాణలోని 3 కోట్లు షేర్ రాబట్టడం విశేషం.

ఇదే సమయంలో థియేటర్స్ లోకి వచ్చిన విజేత, చినబాబు సినిమాలు ఓ మోస్తరుగా బాగున్నా.. ‘ఆర్ ఎక్స్ 100’ ముందు తేలిపోయాయి. ఆ పైగా దగ్గరలో విడుదలకి పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా వసూళ్ల పరంగా ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అవకాశం ఉంది.

మామాట: ఆర్‌ఎక్స్ బైక్‌లాగానే కలెక్షన్లు కూడా వేగంగా దూసుకెళుతున్నాయి…

Leave a Reply