యూత్‌ని ఆకట్టుకునే ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్

Share Icons:

ఢిల్లీ, 22 జూన్:

యువతని ఆకట్టుకునేలా ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రివోల్ట్ ఇంటెల్లి కార్ప్’  తొలిసారి తయారు చేసిన విద్యుత్‌ మోటర్‌ సైకిల్ ‘ఆర్‌వీ400’ను ఆవిష్కరించింది. ఇది త్వరలోనే ఇండియా విడుదల కానుంది. దీని ధర సుమారు లక్ష రూపాయల వరకు ఉండొచ్చని అంచనా.

ఇక ఈ బైక్‌ను ఒక్కసారి రీచార్జి చేస్తే 156 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని, దీని వలన ఎటువంటి కాలుష్యం ఉండబోదని కంపెనీ తెలిపింది. ఇక ఈ బైక్ కావాలనుకునేవారు ఈ నెల 25 నుంచి రూ.1,000 చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ ద్వారా, లేదా అమెజాన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

మరో నాలుగు నెలల్లో ఈ బైక్‌ని ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె, బెంగళూరు, హైదరాబాద్, నాగపూర్, అహ్మదాబాద్, చెన్నైలలో విడుదల చేయనున్నారు. నాలుగు గంటల్లో పూర్తిస్థాయిలో రీచార్జి కానున్న ఈ బైక్ బ్యాటరీ 150 కిలోమీటర్లకు పైగా పని చేయనున్నది. ఇక రివోల్ట్ ఆర్వీ 40 సంప్రదాయ స్ట్రీట్ కమ్యూటర్ బైక్‌గా ఉంటుంది. అలాగే ఎల్ఈడీ లైటింగ్, స్కల్ప్‌టెడ్ బాడీ వర్క్, అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, మొనోషాక్ రేర్ సస్పెన్షన్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్స్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రిజనరేటివ్ బ్రేకింగ్ సామర్థ్యం గల ఈ బైక్ ను బ్రేకింగ్ ఎనర్జీతో రీచార్జి చేసుకోవచ్చు.

ఆర్వీ400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మూడు మోడ్స్ ఎకో, సిటీ, స్పోర్ట్ వేరియంట్లలో లభిస్తుంది. ఎకో మోడ్ బైక్ బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 156 కిలోమీటర్లు, సిటీ మోడ్ 80-90 కి.మీ, స్పోర్ట్ మోడ్ బైక్ 50-60 కి.మీ. వరకు నడుస్తుంది. బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు మాత్రమే.

ఇందులో డెడికేటెడ్ మొబైల్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ సాయంతో బ్యాటరీ చార్జింగ్, రిమోట్ స్టార్టింగ్‌తోపాటు బైక్ లొకేషన్, రియల్ టైం రైడింగ్ ఇన్ఫర్మేషన్, జియో ఫెన్సింగ్, శాటిలైట్ నావిగేషన్, బ్యాటరీ స్వాపింగ్ లొకేషన్ తెలుసుకోవచ్చు.

 

Leave a Reply