హైదరాబాద్‌లో దారుణం…నడిరోడ్డు మీద కత్తితో గొంతు కోసి హత్య

Share Icons:

హైదరాబాద్, 29 నవంబర్:

హైదరాబాద్ నయాపూల్ చౌరస్తాలో నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఓ యువకుడు మరో వ్యక్తి ప్రాణం తీశాడు. అప్పటికీ కసి తీరని ఆ  యువకుడు రక్తపు మడుగులో పడిఉన్న వ్యక్తి గొంతును కత్తితో కోసి మరింత పాశవికంగా వ్యవహరించాడు.

ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చంపిన యువకుడి పేరు అబ్దుల్ ఖాజా, చనిపోయిన వ్యక్తి పేరు షకీర్ ఖురేషీ (35). ఇద్దరూ ఆటోలను అద్దెకు ఇస్తూ ఉంటారు. అయితే ఒకరికి ఆటో అద్దెకు ఇచ్చే విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవ మరింత ముదరడంతో ఖురేషీ వచ్చి కత్తితో ఖాజా మీద దాడి చేశాడు. దీంతో రెచ్చిపోయిన ఖాజా కూడా చాకు తీసుకుని దాడి చేశాడు. ఈ ఘటనలో ఖురేషీ ప్రాణాలు కోల్పోయాడు.

ఇక ఈ ఘటనపై అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే కంట్రోల్ రూమ్‌ను అలర్ట్ చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే, ఖురేషీని అత్యంత దారుణంగా హతమార్చిన ఖాజా మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా ఆ శవం పక్కనే కూర్చున్నాడు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా అతను అక్కడే ఉన్నాడు. ఇక పోలీసులు ఖాజాని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

మామాట: చిన్న గొడవ ప్రాణాలు తీసేవరకు వచ్చిందిగా…

Leave a Reply