రష్యాలో కుప్పకూలిన విమానం.. 71 మంది మృతి

Share Icons:

మాస్కో, ఫిబ్రవరి 12 :

రష్యాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టేకాఫ్ తీసుకున్న మూడు నిమిషాల వ్యవధిలోనే విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు.

మాస్కోలోని డొమొడెడొవో విమానాశ్రయం నుంచి ఆంటొనోవ్‌ ఏఎన్‌–148 జెట్‌ విమానం ఉరల్‌ పర్వతశ్రేణుల్లోని ఓర్క్స్‌ పట్టణానికి ఆదివారం బయలుదేరింది.

గాలిలోకి ఎగిరిన మూడు నిమిషాల వ్యవధిలోనే సమీపంలోని రామెన్‌స్కీ జిల్లాలోని అర్గునోవో గ్రామం సమీపంలో కూప్పకూలిపోయింది. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 71 మంది దుర్మరణం చెందారు.

మృతుల్లో 65 మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ఏఎన్‌–148 విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పేర్కొంది. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో దాదాపు 150 మంది సహాయక సిబ్బంది కాలినడకన ప్రమాదస్థలికి చేరుకుంటున్నారు.

కాగా, విమానం గాలిలోనే కాలిపోతూ కిందపడిన దృశ్యాలను ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు ఈ ప్రమాదాన్ని తాము కళ్లారా చూశామని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌ అత్యవసర ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి కోరారని తెలిసింది. ఈ లోపే విమానం కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది.

మామాట : విమాన ప్రయాణం… గాలిలో దీపం

English Summary :

A Russian Flight crashed near Moscow on Sunday, 71 passengers along with crew died in this incident. After take off that flight collapsed near a village.

Leave a Reply