జీవితకాల పతనానికి రూపాయి

Share Icons:

ముంబాయ్, సెప్టెంబర్ 10,

రూపాయి గతంలో ఎన్నడూ లేనంత తక్కువకు 72.18 కి దిగజారింది. అమెరికా డాలర్లతో మరో 45 పైసల స్థాయికి చేరింది.

అంతర్జాతీయంగా డాలర్ కు డిమాండు పెరగడంతో సామవారం రూపాయి మరో 45 పైసలు కిందకు దిగి జీవితంలో లేనంతగా రూ.72.18 మారక స్తితికి చేరుకుంది. గత ఆరవ తేదీ కూడా ఇలాగే డాలర్ తో రూపాయి మారక విలువ 72.11కి దిగజారింది,  ఆ రికార్డును సోమవారం బద్దలు చేయిన మార్కెట్ ఉదయం 72.15 తో మొదలైంది. అంతర్జాతీయంగా ఆయిల్ కంపినీల డిమాండు నేపథ్యంలో, చైనా-అమెరికా వాణిజ్య పోటీ కారణంగా కూడా రూపాయి పతనం జరిగి ఉంటుందని వ్యాపారులు పేర్కొన్నారు.

కాగా, బిఎస్ఈ సెన్సెక్స్ 85.01 పాయింట్లు తగ్గి 38,304, 81 వద్ద ముగిసింది .

మామాట:  ఈ రూపాయీ జారడమేనా, పైకి రావడం నేర్చుకోలేదా

Leave a Reply