రూ.10 నాణేనికి ఓ దండం.

Rs 10 coin -saying No -People
Share Icons:

అమరావతి, మే18,

ఇండియన్ కరెన్సీలో… బంగారం రంగులో మెరుస్తూ ఆకట్టుకుంటుంది రూ.10 కాయిన్. కానీ ఆ నాణేన్ని ఎందుకోగానీ ప్రజలు అనధికారికంగా బ్యాన్ చేసేశారు రిజర్వ్‌ బ్యాంక్ ప్రకారం రూ.10 నాణేలు చెల్లుతాయి. వాటిని ఎవరైనా సరే వద్దని అనడానికి వీల్లేదు. అది నేరం కూడా. ప్రజలు మాత్రం ఆర్బీఐ సూచనల్ని పట్టించుకోవట్లేదు. రూ.10 నాణెం ఎవరైనా ఇస్తే, వద్దంటున్నారు. తమ దగ్గర ఎవరూ తీసుకోవట్లేదని అంటున్నారు.

ఒక్క రాష్ట్రంలోనో కాదు… ఏకంగా దేశమంతా ఇలాంటి పరిస్థితే ఉండటం విశేషం. ప్రజలంతా ఏకమై పది రూపాయల నాణెం విషయంలో ఒకేలా స్పందిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.10 నాణేన్ని తప్పనిసరిగా తీసుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థలు, వ్యాపారస్థుల విషయంలో మాత్రం ఇదో పెద్ద సమస్యగా మారింది.

దారుణమైన విషయమేంటంటే… ఎవరైనా రూ.10 నాణెం ఇస్తుంటే, వాళ్లను అత్యంత అవమానకరరీతిలో చూస్తున్నారు కొందరు వ్యాపారులు. ఈ దరిద్రాన్ని నాకు అంటగడుతున్నారా అన్నట్లు ఉంటున్నాయి వాళ్ల ఫేసుల్లో ఫీలింగ్స్.   చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే… ఎవరైనా తమ దగ్గర రూ.10 నాణెం ఉంటే, దాన్ని వాడకుండా అలా ఓ మూల ఉంచేస్తున్నారు. దాన్ని తీసుకెళ్లినా ఎవరూ తీసుకోరనే అభిప్రాయమే అందుకు కారణం.

మరికొందరైతే తమ దగ్గరకు రూ.10 కాయిన్ వస్తే చాలు… ఎలా దాన్ని వదిలించుకుందామా అని ప్రయత్నిస్తున్నారు. కారణం దాన్ని ఎవరూ తీసుకోవట్లేదన్న ఉద్దేశమే.  2009 మార్చి 26న మొదటి రూ.10 కాయిన్‌ను రిజర్వ్‌ బ్యాంక్ రిలీజ్ చేసింది. చివరిసారిగా 2017 జూన్ 29న సరికొత్త రూ.10 నాణేన్ని విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 14 డిజైన్లలో రూ.10 నాణేలు ఉన్నాయి. అవి అన్నీ చెల్లుతాయి. అయినప్పటికీ ప్రజల్లో మాత్రం నమ్మకం కలగట్లేదు.

మామాట- కొన్నిమార్లు ఇంతే డబ్బుక్కూడా దరిద్రం పడుతుంటుంది

Leave a Reply