మూడో షెడ్యూల్‌కి సిద్ధమైన ఆర్‌ఆర్‌ఆర్…

Share Icons:

హైదరాబాద్, 22 మే:

దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా… భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా…. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు.

అయితే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ షూటింగు జరుగుతూ ఉండగా, జిమ్ లో చరణ్ కాలు బెణకడం .. ఆ తరువాత ఎన్టీఆర్ చేతికి గాయం కావడం జరిగింది. దాంతో ఈ సినిమా షూటింగుకి కొన్ని రోజుల పాటు విరామాన్ని ప్రకటించారు.

ఇక గాయాలు తగ్గడంతో… తారక్, చరణ్‌లు షూటింగ్‌కి సిద్ధమవుతున్నారు. మూడో షెడ్యూల్‌లో భాగంగా  హైదరాబాద్ – అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ .. చరణ్ .. అలియా భట్ తదితరులు ఈ షూటింగులో పాల్గొననున్నట్టు సమాచారం. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం …జూలై 30 2020లో విడుదల కానుంది.

మామాట: మొత్తానికి షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది

Leave a Reply