ఆర్‌ఆర్‌ఆర్’ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ అప్పుడే వస్తుందా..!

Ram Charan, hero, heroine,tollywood,maamaata,primepagesinfo
Share Icons:

హైదరాబాద్, 14 ఫిబ్రవరి:

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో  రామ్ చరణ్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.

ఏ‌డినులో ఒకటి బ్రిటీష్ అధికారిగా, మరొకటి 1940ల కాలంనాటి ఓ ప్రత్యేకమైన  మాస్ లుక్‌లో కనిపిస్తారట. అలాగే క్లైమాక్స్‌కు వచ్చే సరికి పూర్తి లుక్ మారిపోతుందట. అప్పుడు స్వాతంత్ర్య సమరయోధుడుగా గెటప్‌లో ఉంటారట.

ఇక కొంత షూటింగ్ జరిపి ఎన్టీఆర్‌కి జక్కన్న బ్రేక్ ఇచ్చాడు. దీంతో తారక్ ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్‌కి వెళ్లనున్నాడు.

కాగా, ఇప్పటివరకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించిన టైటిల్‌ కానీ ఫస్ట్‌లుక్‌ కానీ ఇతర నటీనటుల వివరాలు కానీ బయటకు రాలేదు. అయితే మార్చి 27 న  రామ్‌చరణ్‌ పుట్టినరోజు వస్తోంది. అప్పుడు సినిమాలో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని  చిత్ర యూనిట్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. మరి చూడాలి జక్కన్న ఎలాంటి ప్లాన్ చేస్తాడో..

మామాట: జక్కన్న ఏ విషయాన్ని బయటకి తెలియనివ్వడంలేదుగా

Leave a Reply