ఆగస్టు 15న ఆర్‌ఆర్‌ఆర్ ఫస్ట్ లుక్…

Share Icons:

హైదరాబాద్:

 

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధుడు కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర వేస్తున్నాడు. ఇక డి‌వి‌వి దానయ్య నిర్మాతగా ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

 

అయితే ఈ సినిమా నుంచి ఇంకా ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. ఆ మ‌ధ్య ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అయిన చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తారేమోన‌ని అభిమానులు భావించిన‌ప్ప‌టికి అది కుద‌ర‌లేదు. అయితే చిత్రం చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో రూపొందుతుంది కాబ‌ట్టి మూవీ ఫ‌స్ట్ లుక్‌ని స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ సారైన రాజ‌మౌళి అభిమానుల ఆశ‌లు ఆవిరి చేయ‌కుండా ఉంటాడా, లేదా అనేది చూడాలి. అలియా భ‌ట్‌, అజయ్ దేవగన్ తో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

Leave a Reply