RRR సినిమా టైటిల్‌కు అర్థం చెప్పిన వి.వి. వినాయక్

Share Icons:
కరోనా పాజిటివ్ కేసులు, కరోనా మృతులు… ఎక్కడ చూసినా ఎటూ చూసినా కరోనానే. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు కాస్త ఆనందం కలిగించే న్యూస్ అందించారు దర్శక ధీరుడు ఎస్.ఎస్. . RRR సినిమాకు సంబంధించిన మోష్న్ పోస్టర్‌ను ఆయన ఉగాది సందర్భంగా విడుదల చేశారు. దీంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా, యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. అటు తారక్ ఫ్యాన్స్… ఇటు మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మోషన్ పోస్టర్ రిలీజ్‌తో ఎన్టీఆర్, చెర్రీల అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మోషన్ పోస్టర్‌లో సినిమా పేరు కూడా ఏంటో చెప్పేశారు రాజమౌళి. ‘రౌద్రం, రణం, రధిరం’ అనే టైటిల్ ‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు మనకు మోషన్ పోస్టర్ చూస్తు అర్థం అవుతుంది.

దీంతో ఈ మోషన్‌ మోస్టర్‌ గురించి మెగాస్టార్ చిరూతో పాటు.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. హీరో హీరోయిన్లు సైతం RRR మోషన్ పోస్టర్ చూసి స్పందిస్తున్నారు. అటు ఫ్యాన్స్ అయితే అప్పుడే తమ బైకులపై RRR టైటిల్‌ను స్టిక్కరింగ్ చేయించేశారు కూడా. తాజాగా దీనిపై డైరెక్టర్ కూడా స్పందించారు. టైటిల్‌లో ఉన్న రౌధ్రం, రణం, రుధిరం అర్థం ఏమిటో వివరించారు.

బ్రిటీష్ ప్రభుత్వ పాలనపై కట్టలు తెంచుకున్నదే ‘రౌద్రం’. ఈ ఇద్దరూ కలిసి చేయాలనుకున్నది ‘రణం’ అని, ఆ యుద్ధంలో వాళ్లు అర్పించినది ‘రుధిరం’ అని ఆయన కామెంట్ చేశారు. దీంతో వినాయక్ కామెంట్ వైరల్ అవుతోంది. ఇక వినాయక్ ట్వీట్‌పై ఆర్జీవీ స్పందించారు. ఒత్తిడిని పెంచే వార్తలు విరామం లేకుండా ఒకదాని తరువాత ఒకటి వినాల్సి వస్తోన్న సమయంలో.. రాబోయే మంచి విషయాల కోసం ఎదురుచూడాలని గుర్తు చేసిన రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు వర్మ. రౌద్రం అంటే కోపం, రణం అంటే యుద్ధం. ఇది చాలామందికి తెలిసిందే. కానీ రుధిరం అంటే కొందరు అభిమానులు కన్ ఫ్యూజ్ అయ్యారు. అయితే వినాయక్ తన ట్వీట్ ద్వారా రుధిరం అనే పదానికి అర్థం కూడా చెప్పారు. రుధిరం అంటే రక్తం అని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు.