యూత్‌కి షాక్..ధరలు పెంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్…

Share Icons:

హైదరాబాద్, 9 ఫిబ్రవరి:

ప్రస్తుతం యూత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈరోజుల్లో ఎక్కువమంది ఈ బైకులనే కొనడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే యూత్ క్రేజ్‌ని రాయల్ ఎన్‌ఫీల్డ్ క్యాష్ చేసుకోడానికి సిద్ధమైంది. అందులో భాగంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొన్ని మోడల్స్‌ వాహనాలపై ధరలను పెంచింది. పెంచిన ధరలు ఈ నెల నుంచి అమల్లోకి వచ్చాయి. 350 సీసీ – 500 సీసీ మధ్య మోడల్ మోటారు సైకిళ్లపై రూ.1500వరకు ధర పెరిగింది. 

అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ 650, కాంటినెంటల్‌ జీటీ 650 ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.

ఇక  కొత్త ధరల ప్రకారం బుల్లెట్‌ 350 ధర రూ.1.34 లక్షలు ఉండగా, క్లాసిక్‌ 350 ఏబీఎస్‌ ధర రూ.1.53లక్షల నుంచి మొదలవుతుంది. అలాగే రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్‌ 350 ఏబీఎస్‌ సిగ్నల్స్‌‌ ఎడిషన్‌ కూడా ధర పెరిగి రూ.1.63లక్షలకు చేరింది. హిమాలయన్‌ ఏబీఎస్‌ ఎడిషన్‌ 1.80లక్షల నుంచి మొదలవుతుంది. ధర పెంపునకు గల కారణాలను ఎన్‌ఫీల్డ్‌ వివరించలేదు. 

ప్రస్తుతం కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరగటమే దీనికి కారణమని రాయల్ ఎన్‌ఫీల్డ్ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం.

మామాట: మొత్తానికి క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటున్నారు…

Leave a Reply