TRENDING NOW

సహజీవనం చేస్తూ శారీరక సంబంధం లైంగికదాడి కాదు – సుప్రీంకోర్టు

సహజీవనం చేస్తూ శారీరక సంబంధం లైంగికదాడి కాదు – సుప్రీంకోర్టు

కొత్త ఢిల్లీ ,జనవరి 5:

సహజీవనం చేస్తూ శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడు.. మహిళను పెండ్లి చేసుకోనప్పటికీ, సెక్స్.. లైంగికదాడి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివరాలలోకి వెళితే.. ఓ నర్సు, డాక్టర్ గతంలో సహజీవనం చేశారు. తరువాత వేరే మహిళను డాక్టర్ పెండ్లి చేసుకోవడంతో  మొదటి మహిళ ద్వారా ఈ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ డాక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించగా జస్టిస్ ఏకే సిక్రి, ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవలే విచారణ జరిపింది. లైంగికదాడికి, పరస్పర సమ్మతితో కూడిన శారీరక సంబంధానికి మధ్య స్పష్టమైన గీత ఉన్నది. ఓ వ్యక్తి నిజంగా ఆమెను పెండ్లి చేసుకోవాలనుకున్నాడా, లేక తన లైంగికవాంఛ తీర్చుకోవడానికి తప్పుడు హామీ ఇచ్చాడా. ఇరువురు ఏకాభిప్రాయంతోనే సహజీవనం చేస్తున్నారా అన్న విషయాన్ని కోర్టు స్పష్టంగా పరిశీలిస్తుంది. ఇద్దరు పరస్పర సమ్మతితో కూడిన శారీరక సంబంధం లైంగికదాడి కిందికి రాదు అని ధర్మాసనం పేర్కొంది. తొలిత పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికవాంఛ తీర్చుకొని, తరువాత కాదని, దురుద్దేశంతోనే పెండ్లి చేసుకోకుంటే లైంగికదాడేనని స్పష్టం చేసింది.

మామాట:  ఇంతకీ ఎవరు ఏ మంటున్నారో తెలుస్తోందా..
(Visited 205 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: