బాలయ్యకు రోజా కౌంటర్: రాయలసీమని నుంచి తరిమికొట్టే రోజు

ysrcp mla roja sensational comments on balayya and pawan
Share Icons:

అమరావతి: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ అప్పుడే సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని రోజా వ్యాఖ్యానించారు. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలకృష్ణను తరిమికొట్టే రోజు వస్తుందని ఆమె అన్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై కూడా రోజా తీవ్ర విమర్ళలు చేస్తున్నారు. పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మను తీసుకొచ్చారని విమర్శించారు. చంద్రబాబు భజనపరులే మండలిలో ఉన్నారని… వారు ఉన్నా లేకున్నా ఒకటే అని రోజా ఎద్దేవా చేశారు.

లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని… మండలి రద్దుతో లోకేశ్ రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని రోజా ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌పై కూడా రోజా విమర్శలు గుప్పించారు. చీకటి జీవోలు అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మూడు రాజధానులకు అనుగుణంగానే సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని రోజా స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ కు జీవోల గురించి ఏమాత్రం అవగాహన లేదని రోజా ఎద్దేవా చేశారు. ఎవరు అడ్డుకున్నా మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు.

అటు టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిలో భూములపై విచారణ జరిపేందుకు ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేస్తూ టీడీపీ నేతల రాజకీయాలకు తెరపడే రోజులొచ్చాయని అన్నారు.

‘మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుల ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది. సీఎం హోదాను సైతం అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారు. మీ రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి’ అని ట్వీట్ చేశారు.

 

Leave a Reply