రోజాకు కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్..

Share Icons:

అమరావతి, 12 జూన్:

నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్  ఓ కీలక పదవి బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో రోజాకు కచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో రోజాకు మంత్రి పదవి ఛాన్స్ మిస్ అయింది.

ఇదిలా ఉంటే ఈరోజు రోజా రెండుసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబుకు ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారని రోజా ఎద్దేవా చేశారు. తనను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది సస్పెండ్ చేశారనీ, కానీ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడామని చెప్పారు.ఏపీ అసెంబ్లీలో తాము టీడీపీ ఎమ్మెల్యేలలాగా ప్రవర్తించబోమని స్పష్టం చేశారు.

 

Leave a Reply