మొదటి టెస్టులో ఎవరు సక్సెస్ అయ్యారు…?

Rohit’s Debut, Ashwin’s Return, Jadeja’s 200th & Shami’s Second Innings Record
Share Icons:

విశాఖపట్నం: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖపట్నం వేదికగా మొదటి టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. భారత్ నిర్దేశించిన 395 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక సఫారీ బ్యాట్స్ మెన్ 191 పరుగులకే చేతులెత్తేయడంతో భారత్‌ 203 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. 3 టెస్టుల ఫ్రీడమ్‌ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. దీంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్ర కొనసాగించింది. ఇప్పటికే వెస్టిండీస్‌పై రెండు మ్యాచ్‌ల సిరీస్‌ నెగ్గి పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌.. ఈ విజయంతో 160 పాయింట్లు ఖాతాలో వేసుకొని టాప్‌ప్లేస్‌ను మరితం పటిష్ఠం చేసుకుంది.

అయితే మొదటి టెస్టులో ముందుగా విజయవంతమైన ఆటగాడి గురించి చెప్పుకోవాల్సి వస్తే అది ఓపెనర్ రోహిత్ శర్మ గురించే మాట్లాడాలి. వన్డే, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ తొలిసారి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగి రెండు సెంచరీలు బాదాడు. మొదటి ఇన్నింగ్స్ లో 176, రెండో ఇన్నింగ్స్ లో 127 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత యంగ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మొదటి టెస్టులో 215 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో కలిసొచ్చాడు.

ఇక నెక్స్ట్ రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మెన్ గా 30 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 40 పరుగులు, బౌలర్ గా మొదట 2 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి రాణించాడు. అటు ఫీల్డర్ గా కూడా సత్తా చాటాడు. ఇక ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదట ఇన్నింగ్స్ లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. అలాగే మొదటి ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయిన ఫాస్ట్ బౌలర్ షమీ రెండో ఇన్నింగ్స్ లో చెలరేగి ఆడి 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో తనవంతు సాయం అందించాడు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో అద్బుత ఇన్నింగ్స్ ఆడి 81 పరుగులతో రాణించాడు.

ఇక కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహనేలు అనుకున్న మేర రాణించలేదని చెప్పాలి.  అటు తెలుగు ఆటగాడు హనుమ విహరికి పెద్దగా అవకాశం రాలేదు. ఇక బౌలింగ్ లో ఇషాంత్ శర్మ కొంచెం వెనుకబడి ఉన్నాడు. అలాగే కీపర్ వృద్ధిమాన్ సాహ బ్యాటింగ్ లో, కీపింగ్ లో కొంచెం ఇబ్బంది పడినట్లు అనిపించింది. మొత్తం మీద మొదటి టెస్టులో రోహిత్, మయాంక్, జడేజా మంచిగా సక్సెస్ అయ్యారు.

 

 

Leave a Reply