రోహిత్ శర్మ లంక జాతీయ జెండాని ఎందుకు పట్టుకున్నాడు?

Share Icons:

కొలంబో, 20 మార్చి:

ఆదివారం శ్రీలంకలో జరిగిన నిదహాస్‌ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ జట్టుపై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరికి వరకు ఉత్కంఠకరంగా జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌కి చారిత్రాత్మక విజయాన్ని అందిచాడు.

అయితే ఫైన‌ల్‌కు ముందు బంగ్లాదేశ్‌, శ్రీలంక మ‌ధ్య జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు తలెత్తిన విష‌యం తెలిసిందే. మ్యాచ్ స‌మ‌యంలో బంగ్లా ఆట‌గాళ్ల అతి ప్ర‌వ‌ర్త‌న‌, విజ‌యం అనంత‌రం బంగ్లా ఆట‌గాళ్లు చేసిన‌ నాగినీ డ్యాన్స్ శ్రీలంక అభిమానుల‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో భార‌త్‌-బంగ్లాదేశ్ ఫైన‌ల్ మ్యాచ్‌లో శ్రీలంక అభిమానులు భారత్‌కు త‌మ పూర్తి మ‌ద్ద‌తు తెలిపారు. మ్యాచ్ జ‌రుగుతున్నంత సేపూ భారత్ జెండాను రెప‌రెప‌లాడిస్తూ, జట్టుకి మ‌ద్ద‌తుగా నినాదాలు చేశారు.

ఇదే కాకుండా మ్యాచ్ ముగిసిన అనంతరం శ్రీలంక అభిమానులు మరింత పండుగ చేసుకునే ఘటన ఒకటి చోటు చేసుకుంది. అదేమిటి అంటే విజయానంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంక జాతీయ పతకంతో మైదానంలో సందడి చేశారు. అసలు లంక స్వాతంత్ర్య వేడుకల పురస్కరించుకొని ఈ ముక్కోణపు టోర్నీని నిర్వహించిన విషయం తెలిసిందే.

అలాగే బంగ్లాదేశ్ క్రికెటర్ల మీద లంక అభిమానులు బాగా కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చివ‌రి బంతికి కార్తీక్ సిక్స్ కొట్టి బంగ్లాను ఓడించ‌గానే శ్రీలంక అభిమానులు పండుగ చేసుకున్నారు. `నాగినీ డ్యాన్స్‌కు అవ‌కాశం లేదు.. భార‌త్‌కే మా మ‌ద్ద‌తు` అని వారు ఫ్లకార్డులు ప్ర‌ద‌ర్శించారు.

దానికి తోడు టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ మ్యాచ్ ముగిశాక వారికి మద్దతుకు ప్రతీకగా ఆ దేశ జెండాను ఊపుతూ వారిలో మరింత ఉత్సహాన్ని నింపారు. దీంతో రోహిత్‌పై లంక అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

రోహిత్‌ శర్మ శ్రీలంక జెండా పట్టుకోవడం సంతోషంగా ఉందని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా రోహిత్‌కి వారు ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ చరిత్రలో ఇదొక అందమైన రోజు అని వారు పేర్కొన్నారు. ఇంకొంతమంది బంగ్లాదేశ్ పొగరుకు రోహిత్ చేసిన ఈ పని చెంపపెట్టులా ఉందని అంటున్నారు. అదండీ ఆవిధంగా భారత్ కెప్టెన్ శ్రీలంక జెండాని పట్టుకుని వారిలో ఉత్సాహాన్ని నింపాడు.

మామాట: ఇరుగుపొరుగు దేశాల స్నేహంగా ఉండటానికి ఇదొక మంచి ఉదాహరణ…..

English summary:

After claiming an emphatic victory, Indian captain Rohit Sharma, instead of waving Indian tri-color, he took the Lankan flag from a fan and took a lap of honor in order to acknowledge the local fans’ support.

Not to forget that the tournament name ‘Nidahas’ means Independence. To celebrate the 70th year of Independence, Sri Lanka Cricket Board organized this tournament.

Leave a Reply