రోహిత్ సెంచరీ వృధా…తొలి వన్డేలో ఆసీస్ ఘనవిజయం

Share Icons:

సిడ్నీ, 12 జనవరి:

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఓపెనర్ రోహిత్ శర్మ(133)ఒంటరి పోరాటం చేసిన ఆసీస్ విజయాన్ని ఆపలేకపోయాడు.  మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 288 పరుగులు చేసింది.

ఇక 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకి ఆరంభంలోనే కోలుకులేని షాక్ తగిలింది. ధావన్, రాయుడు డకౌట్‌లు అవ్వగా, కెప్టెన్ కోహ్లీ 3 పరుగులకి వెనుదిరిగాడు. దీంతో ఇండియా 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక భారత్ 150 కూడా దాటడం కూడా కష్టం అనుకున్న తరుణంలో రోహిత్, ధోనిలు వీరోచితంగా పోరాడారు. ఇద్దరు కలిపి ఆచి తూచి ఆడుతూ స్కోరు బోర్డుని 100 దాటించారు. ఇక ధోనిని 51 పరుగుల వద్ద బెహ్‌రెన్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కార్తీక్(12), జడేజా(8) స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు.

అయితే రోహిత్ మాత్రం తన పోరాటం ఆపలేదు. ఒక్కసారిగా ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడి పరుగులు రాబట్టడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తన సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక బాల్స్‌కి రన్స్‌కి అంతరం పెరిగిపోవడంతో ఆ కంగారులో రోహిత్ 133 పరుగులకి స్టయినిస్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. చివరిలో భువనేశ్వర్(29) మెరుపులు మెరిపించిన ఇండియా ఓటమి ఆగలేదు. దీంతో 50 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 254/9 పరుగులు చేసి 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్‌సన్ 4 వికెట్లు తీయగా, జాసన్ 2, స్టయినిస్ 2, పీటర్ 1 ఒక వికెట్ తీసుకున్నాడు. 4 వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలపాత్ర పోషించిన రిచర్డ్‌సన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

 మామాట: మొత్తానికి బ్యాట్స్‌మెన్ దేబ్బెశారు…

Leave a Reply