కోహ్లిని మించిపోతున్న రోహిత్..!!

Share Icons:
న్యూఢిల్లీ, 27డిసెంబర్:

లంకేయులతో మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ చేసి(208) అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.

తన మెరుపు దాడితో టీమిండియా శ్రీలంకపై 2-1తో వన్డే సిరీస్‌ను, 3-0లో టి20 సిరిస్‌లను కైవసం చేసుకుంది.

అప్పటి నుంచి రోహిత్ శర్మ పై ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. కోహ్లి కన్నా రోహిత్ శర్మనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని తాజాగా భారత మాజీ క్రికెటర్‌ సందీప్ పాటిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..

indian ex cricketer says that rohit is better than kohli

‘కోహ్లి ఫ్యాన్స్‌కు ఈ మాటలు ఒప్పుకోకున్నా ఇది నిజం. విరాట్‌ కోహ్లి చాలా గొప్ప బ్యాట్స్‌మెన్‌ అనడంలో ఏ విధమైనా సందేహం లేదు. అతను టెస్టులో నంబర్.‌1 బ్యాట్స్‌మెన్.

రోహిత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లి కన్నా ముందు ఉన్నాడు. రోహిత్‌ శర్మ ఈ సంవత్సరం లిమిటెడ్‌ ఓవర్స్‌ మ్యాచ్‌లో బాగా ఆడాడు. అయితే శ్రీలంకపైనే ఎక్కువ మ్యాచ్‌లో ఆడాడని వాదించే వారు కూడా ఉన్నారు. కోహ్లి కూడా ఆ జట్టుపైనే ఆడాడన్న సంగతి మరిచిపోవద్దు. కేవలం జట్టులో బ్యాట్స్‌మన్‌గానే కాదు.. అదనంగా సారథ్య బాధ్యతలున్నా అతడు మెరుగ్గానే రాణించాడు’’ అని సందీప్‌ పాటిల్‌ అన్నారు.

మామాట: తన అద్భుతమైన ఆటతో అంచలంచలుగా ఎదుగుతూ….అందరి ప్రశంసలు పొందుతున్నాడన్నమాట..

Leave a Reply