2.ఓ సెన్సార్ పూర్తి…29న విడుదల

robo 2.o sensor completed u/a certificate
Share Icons:

హైదరాబాద్, 14 నవంబర్:

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రోబోకి సీక్వెల్‌గా ‘2.ఓ’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఎమీ జాక్సన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. 
అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికేట్‌ను సంపాదించుకుంది. కాగా,విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి. అలాగే ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఈ సినిమా సరికొత్త చరిత్రని సృష్టిస్తుందని ఇటు రజినీ అభిమానులు .. అటు అక్షయ్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

మామాట: మరి 2.ఓ ఎలాంటి సంచలనాలకు తెరలేపుతోందో…

Leave a Reply