కుటుంబాలను కూల్చుతున్న రోడ్డు ప్రమాదాలు

Share Icons:

హైద్రాబాద్, ఆగస్టు 29,

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అనేక కుంటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. గతంలో ఎందరో ప్రముఖులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. మరీ ముఖ్యంగా కొందరు ప్రముఖుల పిల్లలు విలాసవంతమైన కార్లు, అధునాతన బైక్‌లు వాడి ప్రమాదాలలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడమే హరికృష్ణ మృతికి కారణాంగా తెలుస్తోంది. దీంతో ప్రముఖుల ఇళ్లలో జరిగిన రోడ్డుప్రమాదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాల్లో ప్రయాణించేవారు సీటుబెల్టు పెట్టుకోవడంపై శ్రద్ద చూపక పోవడమే ఈ విషాధాలకు ప్రధానకారణంగా చెప్పవచ్చు.

2003- అక్టోబరులో సినీ నటుడు బాబుమోహన్ కుమారుడు, పవన్ కుమార్(26) బైక్‌పై వస్తూ తెల్లవారుజామున 5 గంటల సమయంలో జూబ్లీహిల్స్ సమీపంలో డివైడర్‌ ను ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు.

2010- జూన్‌లో సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు, కోట ప్రసాద్(39) బైక్‌పై వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో వాహనాన్ని ఢీకొని మృతి చెందారు.

2011- సెప్టెంబరులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్(19) ఔటర్ రింగ్‌ రోడ్డుపై తన 1000 సీసీ బైక్‌తో ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందపడ్డాడు. ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు.

2011- డిసెంబర్‌లో మాజీ మంత్రి కోమటిరెడ్డి తనయుడు, ప్రతీక్‌ రెడ్డి(19) నార్సింగ్ -పటాన్‌ చెరు మధ్య కొల్లూరు సమీపంలో కారు ప్రమాదంలో మృతి చెందాడు.

2012- నవంబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మరణించారు.

2013- హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న టీడీపీ మాజీ ఎంపీ లాల్‌జాన్ భాష రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

2014- ఎన్నికల సమయంలో ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మృతి చెందారు.

2014-  నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరాం మృతి చెందాడు.

2017- మేలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

2017- జూన్‌లో ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు నటుడు భరత్‌ కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

సీటు బెల్టు ప్రయోజనం…

సీటుబెల్ట్ ఉపయోగం ఏమిటంటే.. అది ప్రయాణీకుణ్ని కారులో (వాహనం) ఒక భాగంగా చేస్తుంది. ఒక వేళ వాహనం వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా ఏదైనా వస్తువు, వాహనానికీ ఢీ కొన్నపుడు ప్రయాణీకుడు కారులోంచి బయటికి ఎగిరిపడిపోకుండా రక్షిస్తుంది.

వేగంగా ప్రయాణించే కారు ఎగురుగా వస్తున్న మరో వాహనం, చెట్టు, పోల్, డివైడర్, రోడ్డు కంచే వంటి వాటిని ఢీకొట్టినపుడు దాని వేగం చాలా త్వరగా, తక్కువ సమయంలో తగ్గిపోతుంది. దీనినే డిక్లరేషన్ (deceleration) అంటారు.  న్యూటన్ నిశ్చల శక్తి సూత్రం దీనిని బాగా వివరిస్తుంది.

సీటు బెల్ట్ రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ప్రయాణీకుని నడుము వద్ద ఉంటుంది. రెండవది భుజం, వక్షంపై అడ్డంగా ఉంటుంది. కారు అకాస్మాత్తుగా ఆగుతున్నపుడు ఈ సీట్ బెల్ట్ శరీరంలోని చాలా భాగాన్ని వెనక్కి లాగి ఉంచుతుంది. అందువలన తక్కువ నష్టం జరుగుతుంది.

సీటు బెల్ట్ లను సాగే గుణం ఉన్న పదార్థాలతో దృఢంగా రూపొందిస్తారు కనుక అవి డాష్ బోర్డు, విండ్ షీల్డ్ కంటే ఎక్కువ రక్షణ ఇస్తాయి.

అయితే ఇక్కడ మీకో సందేహం రావచ్చు. సాగే గుణం ఉంటే సీటు బెల్ట్ ఎలా రక్షిస్తుంది అని, అయితే వాటిని రూపొందించే సమయంలోనే వాహనం వేగం అకస్మాత్తుగా తగ్గుతున్నపుడు సీటు బెల్ట్ బిగుసుకునే విధంగా ఏర్పాటుచేసి ఉంటారు.

మామాట: ఈ మారు మరవ కుండా సీటు బెల్టుపెట్టుకోండేం…

Leave a Reply