ఆర్కే నగర్  ఉప ఎన్నికల్లో విశాల్, దీపా నామినేషన్ల తిరస్కరణ..

Share Icons:

చెన్నై, 5 డిసెంబర్:

ఆర్కే నగర్  ఉప ఎన్నికల్లో పోటీ చేస్తునని ప్రకటించి, నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా విశాల్ నామినేషన్‌ దాఖలు చేశాడు.

ఈ రోజు నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల కమిషన్ విశాల్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.

ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న విశాల్ నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది.

అలాగే జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది.

అఫిడవిట్‌లో లోపాల కారణంగా దీపా జయకుమార్‌ నామినేషన్‌ తిరస్కరించామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

విశాల్ నామినేషన్ వేసే సమయంలో ఆయనను బలపరుస్తూ సంతకాలు చేసిన పది మందిలో ఇద్దరి సంతకాలు సరిగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఈసీ తెలిపింది. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా విశాల్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని అనుకుంటునట్టు చెప్పిన విశాల్‌కు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఇప్పటికే ఆయన తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. విశాల్ అప్పటి నుండి ప్రజలకు ఏదొక రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి మరింత చేరువై దిశగా అడుగులు వేయగా అది కాస్తా బెడిసికొట్టింది. త్వరలో విశాల్ రాజకీయ పార్టీ పెడుతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇంకా ఆర్కే నగర్  ఉప ఎన్నికల్లో దీపా, విశాల్‌ నామినేషన్ల తిరస్కరణతో ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది. ఏఐఏడీఎంకే అభ్యర్థిగా మధుసూదన్‌, డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్‌, భాజపా అభ్యర్థిగా నాగరాజన్‌, ఏఐడీఏడీఎంకే బహిష్కృత నేత టిటివి దినకరన్‌ ప్రస్తుతం బరిలో ఉన్నారు.

మామాట: మరి ప్రధాన పార్టీల్లో విజయం ఎవరిని వరిస్తుందో?

Leave a Reply