గోదావరి ప్రమాదాలు-ప్రభుత్వం తీరుతెన్నులు

Share Icons:

తిరుపతి, జూలై 19 ,  గోదావరి నదిలో  ప్రతి ఏటా వరుస ప్రమాదాలలో ఎందరో ప్రజలు మరణిస్తున్నా రాష్ట్రప్రభుత్వంలో చలనంలేదని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వార్త… ప్రతిపక్షం కనుక వారు అలాగే అంటారు అనుకుందాం…. మరి వాస్తవంగా జరుగుతున్నది ఏమిటి? విభజన తరువాత గోదావరి పుష్కరాల సమయంలో ఎందరు చనిపోయారు? దానికి బాధ్యులు ఎవరు? ఆ తరువాత తరచుగా గోదావరిలో జరుగుతున్న పడవ ప్రమాదాలను నివారించే అవకాసం లేదా…! ప్రభుత్వం ఒక ప్రమాదం జరిగే వరకూ వేచి ఉండి, ప్రమాదం జరిగిన తరువాత తాపీగా పరిహారం ప్రకటిస్తే సరిపోతుందా… ?!

ఇటీవల జరిగిన నాటు పడవ మునిగిపోయిన ఘటనలో టీడీపీ ప్రభుత్వం స్పందించిన తీరు దారుణంగా ఉందని బాధితులు వాపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన సహాయక చర్యలు అందించడానికి లైఫ్‌ జాకెట్లను కూడా ఏర్పాటు చేయలేదని పరిస్థితులలో జిల్లా యంత్రాంగం ఉంది.

గోదారిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో టీడీపీ ‍ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్థానిక నేతలు విమర్శించారు. ఐ పోలవరం మండలం పశువుల్లంక వద్ద గత శనివారం గోదారిలో పిల్లర్‌ను ఢీకొట్టి పడవ బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ‍ప్రమాదంలో గల్లంతయిన ఏడుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా మిగతా వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలలో గాయపడిన వారికి ఎలా చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదాలన్నీ మానవ తప్పిదాలే కదా, దానికి పాలకులు బాధ్యత వహించవలసిన అవసరం లేదా.

బాధిత కుటుంబాలను  ఎలా ఆదుకుంటారు? ఇప్పటివరకూ ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎందరు మరణించారు. ఈ బాధిత కుటుంబాలకు ప్రకటించిన సాయం అందిందా. అధికారులు స్పంధిచారా.. అంటే లేదనే సమాధానం వస్తోంది. పరిపాలన అంటే ఏమిటి. పెద్ద పెద్ద ప్రాజక్టులు కట్టడం, భారీ పథకాలు ప్రకటించడమేనా, పల్లెల్లో తాగడానికి నీల్లు, గ్రమీణ ఆరోగ్య కేంద్రాలలో వైద్యలు, మందులు, వసతులు అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకో వద్దా, ఏటా వర్షాకాలంలో గోదావరిలో ఇటువంటి పడవ ప్రమాదాలు జరుగుతున్నాయికదా, ప్రభుత్వం ఏ నివారణ చర్యలు తీసుకుంది. ఎందుకు ప్రమాదాలను నివారించలేక పోతోంది. చాలా ప్రమాద సంఘటనల అనంతరం బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో కూడా తీవ్రజాప్యం జరుగుతోందన్నతి నిష్టుర సత్యం.

లంక గ్రామాలకు రోడ్డు బ్రిడ్జీలు నిర్మంచడంలో ఉన్న అడ్డంకులు ఏమిటి, వాటిని ఈ పేరుగొప్ప రాష్ట్రప్రభుత్వం అధిగమించలేనపుడు… 40 ఏళ్ల పాలనానుభవం ఎందుకు? అని సామాన్యుడు అనుకోవడంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు.

మామాట: మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా.

Leave a Reply