ధవన్ స్థానంలో పంత్

bharat x wicket keeper syed kirmani ideas to rishab pant
Share Icons:

 

లండన్, 12 జూన్:

గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా…బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధావన్‌కు ఎడమచేతి బొటన వేలుకు గాయమైన విషయం తెలిసిందే.

అయితే గాయం వలన ధావన్ కు మూడు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇక శిఖర్ ధవన్ స్థానంలో ఆడేందుకు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశం దొరికింది. టీమ్ మేనేజ్‌మెంట్ విజ్ఞప్తి మేరకు బీసీసీఐ ఈరోజ్ పంత్‌ను భారత్ నుంచి ఇంగ్లండ్ పంపుతున్నట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఈరోజు సాయంత్రానికి పంత్ ఇంగ్లండ్ కు చేరుకునే అవకాశం ఉంది. అయితే పంత్ తుది జట్టులో ఆడతాడో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వర్షం భారత్‌, కివీస్‌ మ్యాచ్‌కూ అడ్డుపడే అవకాశముంది. బర్మింగ్‌హామ్‌, పీటర్‌బొరో, న్యూ కాజిల్‌ సహా ఇంగ్లండ్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. సుదీర్ఘంగా కురిసే వర్షంతో వరదలు కూడా వచ్చేందుకు ఆస్కారముందని, రవాణాకు తీవ్ర అంతరాయం కలగొచ్చని ప్రజలను హెచ్చరించింది. కాగా, నాటింగ్‌హామ్‌లో బుధవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసి, గురువారం మధ్యాహ్నం వరకు జల్లులు కురుస్తాయని పేర్కొంది.

 

Leave a Reply