మల్కాజిగిరిలో రేవంత్ విజయం సులువేనా…?

Share Icons:

హైదరాబాద్, 14 మార్చి:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఓటమి పాలైన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల పోటీలో ఆయనను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. అందుకు రేవంత్ కూడా సుముఖంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీకి దిగుతున్నారు. ఇక ఈ విషయం తెలిశాక రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలోకి దిగుతానని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే రేవంత్‌ను ముందుగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని పార్టీ చెప్పడంతో అందుకు ఆయన విముఖుత వ్యక్తంచేసినట్లు సమాచారం. దీంతో రేవంత్‌ మల్కాజిరిగి నుంచి ఎన్నికల బరిలోకి దిగనుననారు.

అయితే 2014 ఎన్నికల్లోనే టీడీపీ నుండి మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటి పరిస్థితుల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డి అయితేనే గెలవగలరని, చెప్పి చంద్రబాబు మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్‌ను.. మల్లారెడ్డికి కేటాయించారు. మల్లారెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించి .. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండటంతో.. రేవంత్ పోటీకి సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే మల్కాజిగిరిలో పోటీ చేస్తే విజయావకాశాలు బాగానే ఉంటాయి. మల్కాజిగిరి దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం. అత్యంత ఎక్కువమంది ఓటర్లు ఉన్న ప్రాంతం. ఇక్క ఆంధ్రా సెటిలర్లు కూడా ఎక్కువ. ఆంధ్రాప్రజలు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ అన్ని ప్రాంతాలు మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.  

దీంతో రేవంత్ ఇక్కడనుంచి పోటీ చేస్తే… సులభంగా విజయం సాధించవచ్చని రేవంత్ రెడ్డి అంచనాలు వేస్తున్నారు. కానీ ఇక్కడ రేవంత్ బరిలోకి దిగితే ఓడించడానికి గట్టి అభ్యర్ధినే పోటీకి దించుతుంది. మరి చూడాలి లోక్‌సభ ఎన్నికల్లో అయిన రేవంత్ సత్తా చాటుతారేమో .

మామాట: మరి ఓటర్లు రేవంత్‌కి ఏ మేర మద్ధతు ఇస్తారో

Leave a Reply