రేవంత్ సైలెంట్‌గా చేస్తున్న పనేంటంటే…

Share Icons:

హైదరాబాద్, 26 ఏప్రిల్:

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీనే లేకుండా చేసే పనిలో అధికార టీఆర్ఎస్ పార్టీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే ఈ సంఖ్య 13కు చేరుకుంటుంది. అప్పుడు కాంగ్రెస్ఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడానికి ఉన్న సాంకేతిక ఇబ్బందులు దాదాపుగా తొలిగిపోతాయి.

దీంతో టీఆర్ఎస్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవద్దని డిసైడయిన టీఆర్ఎస్… ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యే సీతక్క, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్యపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే రోహిత్ రెడ్డి చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సన్నిహితుడు కావడంతో… ఆయన టీఆర్ఎస్‌లో చేరే విషయంలో అంత సుముఖంగా లేరు.

కానీ భద్రాచలం ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమని తెలుస్తోంది. దీంతో సీతక్కని ఎలా అయిన పార్టీలోకి తీసుకుంటే తాము అనుకున్న పని అయిపోతుందని టీఆర్ఎస్ భావిస్తుంది. కానీ సీతక్కను కారెక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ ఆశలపై కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డి నీళ్లు చల్లినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, సీతక్కలకి ఉన్న అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు. సీతక్క రేవంత్‌ని తన సోదరుడుగా భావిస్తారు. దీంతో రేవంత్‌ని కాదని ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోడు.

అయితే సీతక్క కాంగ్రెస్ వీడకుండా రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ తన ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కేంద్రంలో ఎన్నికల తరువాత కాంగ్రెస్ మద్దతు కూడిన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమనే భావనలో రేవంత్ రెడ్డి… టీఆర్ఎస్‌లో చేరొద్దంటూ సీతక్కను నిలువరిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ఎల్పీ విలీనాన్ని అడ్డుకోవడానికి రేవంత్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

మామాట: మరి రేవంత్ ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి…

Leave a Reply