TRENDING NOW

హరీశ్…నీ జాతకం అంతా మీ మామ దగ్గర ఉంది…

హరీశ్…నీ జాతకం అంతా మీ మామ దగ్గర ఉంది…

ఢిల్లీ, 8 నవంబర్:

హరీశ్‌రావు తలకాయ కోసుకుని కేసీఆర్ ముందు పెడితే ఇది తలకాయ కాదు.. పుచ్చకాయ అని అంటారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ…. హరీశ్‌రావు నిప్పులో నడిచినా తన శీలాన్ని నిరూపించుకోలేరని, ఎందుకంటే ‘‘నువ్వు ఎట్లాంటివాడివో.. నువ్వు నమ్మినవాళ్లను ఎలా మోసం చేశావో మీ మామ కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసునని అన్నారు.

ఇక నీ పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో మేనమామకు చెప్పాల్సిన అవసరం లేదని, నీ జాతకం అంతా మీ మామ వద్ద ఉన్నదని, నువ్వు ఏమేమి చేశావో కేసీఆర్‌కు’’ తెలుసునని రేవంత్ చెప్పారు. అందుకే కేసీఆర్‌ను నమ్మించడానికి హరీశ్ పదే పదే మహాకూటమిపై విమర్శలు చేస్తున్నారని, ఇవాళ చంద్రబాబుకు లేఖ కూడా రాశారని రేవంత్ విమర్శించారు.

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

అలాగే గత నెల 25వ తేదీ సాయంత్రం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్లో ఉండే నర్సారెడ్డిని తీసుకుని హరీశ్ క్వార్టర్‌కు వచ్చి 3 గంటలపాటు రహస్య చర్చలు జరిపారని చెప్పారు. ఇక వల్లి చర్చలు జరిపిన మరుసటి రోజు ఉదయం నర్సారెడ్డి ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారంటే.. హరీశ్-కేసీఆర్ మధ్య ఉప్పు, నిప్పులా ఉందా? లేదా? అన్నది ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మామాట: టీఆర్ఎస్ నేతలు కూడా మీ జాతకం చంద్రబాబు దగ్గర ఉంది అంటున్నారుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: