కేసీఆర్ బయోపిక్: రేవంత్‌కి సంబంచించిన ఆ సీన్‌ కూడా ఉందా..

KCR Biopic Udyama Simham first look released
Share Icons:

హైదరాబాద్, 21 జనవరి:

తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా ఉద్యమ సింహం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కేసీఆర్ పాత్రను నటరాజన్ పోషిస్తున్నారు. అయితే గత ఏడాది నవంబర్‌లో విడుదల కావల్సిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లింది. అయితే ఫొటోగ్రాఫ్స్‌కు సంబంధించిన దృశ్యాలను తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాలో సోనియా, రాజీవ్ గాంధీ ఫొటోలను కూడా వాడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాంగ్రెసు కండువాను వాడారు. దీన్ని తొలగించాల్సిందిగా సెన్సార్ బోర్డు అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. 

ఇక ఇవేకాక ఇందులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఉదంతం కూడా సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇలాంటి అభ్యంతకరమైన సీన్లని తొలగించాలని సెన్సార్ చిత్రబృందాన్ని కోరినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

మామాట: సినిమా విడుదల అయితేనే గాని ఏ సీన్స్ ఉన్నాయో తెలుస్తోంది…

Leave a Reply